
నల్లగొండ, క్రైమ్ మిర్రర్ :- నల్లగొండ మండలం, నర్సింగ్ బట్ల గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ నేతకానీ సుదర్శన్ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. స్నేహ లారీ డ్రైవర్ యూనియన్ నర్సింగబట్ల సభ్యులు సుదర్శన్ కుటుంబసభ్యులను పరామర్శించి 50కేజీ ల బియ్యం అందజేసి, 10 వేల రూపాయలు ఆర్ధిక సాయం అందజేశారు. కూతురు పేరు మీద స్నేహ లారీ డ్రైవర్ యూనినన్ తరుపున డబ్బులు డిపాజిట్ చేస్తామని కుటుంబసభ్యులకు బరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా లారీ డ్రైవర్ యూనియన్ కు కృతజ్ఞతలు తెలిపారు.స్నేహ లారీ డ్రైవర్ యూనియన్ సభ్యులు, కుటుంబసభ్యులు గ్రామస్థులు పాల్గొన్నారు.
Read also : చండూరు మున్సిపల్ మడిగలు ప్రవేటు వేలం…?
Read also : రేవంత్ పర్యటనకు మంత్రి కొండా సురేఖ గైర్హాజరు