ఆంధ్ర ప్రదేశ్

సికింద్రాబాద్ ఘటనపై... గుంటూరులో నిరసన?

తెలంగాణ లోని సికింద్రాబాద్ నగరంలో వున్న ముత్యాలమ్మ తల్లి దేవస్థానం లో అమ్మ వారి విగ్రహాన్ని అర్ధరాత్రి దాటాక ధ్వంసం చేసిన ముస్కరున్ని తక్షణమే శిక్షించాలి అంటూ సికింద్రాబాద్ నగరంలోని హిందువులు తమ నిరసన కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా హిందూసంఘాల వాళ్ళు ధర్నాలు చేసే వాళ్ళను ఆ రాష్ట్ర ప్రభుత్వం అమానుషం గా లాఠీచార్జి చేసి హిందువులను గాయపరిచారు. అందుకు నిరసనగా గుంటూరు నగరంలో గ్లోబల్ హిందూ హెరిటేజ్,& హిందూ సంఘాలు, బీజేపీ కార్యకర్తలు స్థానిక శంకర్ విలాస్ సెంటర్ లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం శంకర్ విలాస్ నుంచి ర్యాలీ గా బయలుదేరి అమరావతి రోడ్డు లోని వివేకానంద విగ్రహం వరకు సాగింది.

ఇందులో హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ తక్షణమే తెలంగాణ ప్రభుత్వం హిందువులకి క్షమాపణ చెప్పాలని,అమ్మవారి విగ్రహాన్ని కాలితో తన్ని ధ్వంసం కి పాల్పడిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా ప్రతి ఒక్క హిందువు కూడా ఇంట్లోనే ఉండకుండా బయటకి రావాలని కోరారు. గడపలోపలే కులం బయటకొస్తే హిందువులు లా అందరూ కూడా ఏకమవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కంచిబొట్ల హర్ష వర్ధన్ శాస్త్రి, చల్లా బ్రహ్మ రెడ్డి, తుంగ యశ్వంత్, యడ్ల నాగమల్లేశ్వర రావు, తూనుగుంట్ల రాజేష్, యక్కలసాయికుమార్, బూరగడ్డప్రవీణ్, లక్ష్మి రామానుజదాసీ, భీమా మధు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button