
హైదరాబాద్ (క్రైమ్ మిర్రర్):-తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను మూడు దశల బదులు రెండు దశల్లో నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి అధికారికంగా లేఖ అందించింది.గతంలో మూడు దశల్లో స్థానిక ఎన్నికలను నిర్వహించగా, ఈసారి సమర్థంగా, వేగవంతంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు రెండు దశల్లోనే నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ అభిప్రాయపడింది.
Also Read : ఘనంగా హయత్‌నగర్ పోచమ్మ బోనాల ఉత్సవాలు
ఈ ప్రతిపాదనకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను బ్యాలెట్ బాక్సుల లభ్యత, కేటాయింపు వివరాలను సమర్పించాల్సిందిగా ఆదేశించింది. అలాగే, ఎన్నికల సమయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రతి క్లస్టర్ పరిధిలో 10 శాతం బ్యాలెట్ బాక్సులను రిజర్వులో ఉంచాలని సూచించింది.ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై రాష్ట్ర ఎన్నికల సంఘం సమాలోచనలు జరుపుతోంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.