క్రైమ్ మిర్రర్ : టాలీవుడ్ నిర్మాత మరియు దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు. ప్రీమియర్ షోల కోసం ముఖ్యమంత్రుల వద్దకు వెళ్లి దేహి అని అడుక్కోవడం కరెక్ట్ కాదని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ప్రీమియర్ షోస్ వెయ్యకపోవడం వల్ల ఒక 100 కోట్లు నష్టం వస్తే ఏం కొంపలు మునిగిపోవని ఆయన మండిపడ్డారు. గతంలో ప్రీమియర్ షోస్ అనేవి ఉచితంగా ప్రదర్శించామంటూ చెప్పుకోచ్చారు.
Read Also : అదే బోరుబావిలో కలెక్టర్ పిల్లలు పడితే నిర్లక్ష్యం చేస్తారా?
ప్రస్తుతం ప్రీమియర్ షోస్ కు కూడా టికెట్లు పెట్టి వాటిని కాష్ చేసుకుంటున్నారు అంటూ తెలిపారు. కాబట్టి వీటిపై ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలపై అదనపు భారం ఎందుకు అంటూ ప్రశ్నించారు. దీనిపై ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తమ్మారెడ్డి భరద్వాజ అన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : హాఫ్ సెంచరీకి పుష్ప!… సెంచరీకి ఇంటర్నేషనల్ పుష్ప?
టికెట్ల కోసం లేదా ప్రీమియర్స్ షో కోసం ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్లి మరి దేహి అని అడుక్కోవడం అసలు కరెక్ట్ కాదని నిర్మాత చెప్పడం ప్రస్తుతం అందరిని కూడా ఆలోచింపజేస్తుంది. ఈ ప్రీమియర్స్ షోస్ కి వచ్చేటువంటి డబ్బులు ఇప్పుడు రాకపోతే ఏమి కొంపలు మునిగిపోవని తెలియజేయడం ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. కాగా మొన్న అల్లు అర్జున్ పుష్ప సినిమాకి ప్రీమియర్స్ సందర్భంగ తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. దీని కారణంగానే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ప్రీమియర్స్ షో లను నిలిపివేశారు.
ఇవి కూడా చదవండి :