గేమ్ చేంజర్ సినిమా లీక్ అవడం చాలా బాధాకరమని నిర్మాత SKN అన్నారు. రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజెర్ సినిమా రిలీజ్ అయిన నాలుగైదు రోజుల్లోనే ప్రైవేట్ బస్సుల్లో మరియు కేబుల్ చానెల్స్లలో ప్రసారం అవ్వడం అనేది తీవ్ర ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. సినిమా అంటే కేవలం హీరో మరియు దర్శకుడు అలాగే నిర్మాతలే కాదు. ఆ సినిమా వెనుక మూడు నుంచి నాలుగు సంవత్సరాల కృషి మరియు అంకితభావం అలాగే వేలాదిమంది కలల ఫలితం ఉంటుందని అన్నారు.
తొక్కిసలాట దురదృష్టకరం!.. ఇకపై అలా జరగకుండా చూస్తా :
భవిష్యత్తులో ఇవి చిత్ర పరిశ్రమకు చాలా ముప్పు కలిగిస్తుందని అన్నారు. ప్రభుత్వాలు వెంటనే స్పందించి వీటిపై ముగింపు పలికేలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సినిమాను బతికించుకునేందుకు అందరూ కూడా ఏకమవుదామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని నెలలు పాటు ఎంతో కష్టపడి సినిమాను చేస్తే ఇలా రెండు మూడు రోజుల్లోనే లీక్ చేయడం అనేది చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం అని అన్నారు.
కుంటి సాకులు చెబుతూ… వ్యవసాయ రైతులను ముంచేశారు!
కాగా శంకర్ మరియు రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చినటువంటి గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజు 187 కోట్ల వసూలు రాబట్టినట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఆ తరువాత నుంచి వరుసగా ఇప్పటికీ మూడు రోజులవుతున్న గాని సినిమా వసూళ్ల ను వెల్లడించకపోవడంతో అసలు సినిమాకు వసూలు వచ్చాయో లేదో అని అనుమానం రేకిత్తుతుంది. అయితే రిలీజ్ అయిన రోజు నుండి ఇప్పటివరకు మిక్స్డ్ టాక్ తో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. చాలామంది కూడా సినిమా అసలు బాలేదు అంటూ శంకర్ మార్కు ఈ సినిమాలో కనపడలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.