![](https://b2466033.smushcdn.com/2466033/wp-content/uploads/2025/02/images-17.jpeg?lossy=1&strip=1&webp=1)
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా తాను నిర్మించిన తండేల్ చిత్రాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పైరసీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. విడుదలైన మొదటి రోజే తండేల్ సినిమా ప్రీ హెచ్డీలో కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో అందుబాటులోకి వచ్చింది. అయితే నేను నిర్మించిన తండేలు చిత్రాన్ని పైరసీ చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని బన్నీ వాసు హెచ్చరించారు. ఈ సినిమా పైరసీ డౌన్లోడ్ చేసుకుని చూస్తున్న వారి పైన కేసులు పెడతామని తెలిపారు. కాగా గతంలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై విడుదల అయిన గీతగోవిందమును పైరసీ చేసిన వారు అరెస్టయిన సంగతిని ఒకసారి గుర్తు చేశారు.
రోహిత్ శర్మ విధ్వంసం!… సెంచరీ తో విమర్శకుల నోళ్లు మూయించేసాడు?
ఫిబ్రవరి 7న తండేల్ చిత్రం దేశవ్యాప్తంగా విడుదలవగా అదే రోజున ఇంటర్నెట్లో అప్లోడ్ చేసారు. అంతేకాకుండా కొన్ని ప్రైవేట్ బస్సుల్లోను ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారని బన్నీ వాసు తెలిపారు. పైరసీ చేసిన వ్యక్తులు ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సినిమాని దయచేసి ప్రతి ఒక్కరు కూడా థియేటర్లోనే చూడాలని తెలిపారు. ఇక ఈ మధ్య గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేజర్ సినిమా కూడా విడుదలైన మొదటి రోజే ఇంటర్నెట్ లోకి హెచ్డి క్వాలిటీతో అందుబాటులోకి వచ్చింది. దీంతో ప్రతి ఒక్క నిర్మాత లేదా డైరెక్టర్లు కూడా భారీ బడ్జెట్లో సినిమాల తీయాలనుకున్న ఈ పైరసీ కారణంగా వణికి పోతున్నారు.
బీజాపూర్ లో భారీ ఎన్కౌంటర్!…దాదాపు 31 మంది మావోయిస్టులు మృతి