మన భారతదేశ టెలికాం సంస్థ అయిన ఎయిర్టెల్ సేవలు అనేవి ఈరోజు నిలిచిపోయాయి. ఈరోజు ఉదయం 10 గంటల 25 నిమిషాల నుంచి ఎయిర్టెల్ నుండి ఇబ్బందులు తలెత్తాయ్. ఎయిర్టెల్ సిమ్ వాడుతున్న ప్రతి ఒక్కరు కూడా కొన్ని అనివార్య సమస్యల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సేవలు నిలిచిపోయిన గంటకే దాదాపుగా 2000 మంది యూజర్లు ఎక్స్ వేదికగా పోస్టులు చేస్తూ నిరుత్సాహాన్ని వ్యక్తం చేశారు.
ఇకపై ఇలా చేస్తే మరణశిక్షే!… రేపిస్టులకు ట్రంప్ మాస్ వార్నింగ్?
బ్రాడ్ బ్యాండ్ మరియు మొబైల్స్ సేవల లో విస్తృతమైన అంతరాయం ఏర్పడడంతో ప్రతి ఒక్క యూజర్ కూడా అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ సరిగా లేకపోవడం అలాగే కాల్స్ కూడా మాట్లాడుతుండగా పడిపోతుండడం లాంటివి జరగడంతో ప్రతి ఒక్కరు కూడా కోపానికి గురయ్యారు. కాబట్టి ఈ అంతరాయం అనేది వినియోగదారుల రోజువారి దినచర్యలను ప్రభావితం చేసిందని చాలామంది అంటున్నారు.
ఎయిర్టెల్ టెలికాం అంతరాయం కారణంగా చాలామంది పనులు కూడా ఆగిపోయాయని అంటున్నారు. ఇంకొంతమంది మా కంటెంట్ నూ ప్రసారం చేయలేకపోతున్నామంటూ మరి కొంతమంది ముఖ్యమైన పనులకు ఇతరులకు కాల్ చేయాలన్న చేయలేకపోయామంటూ అన్నారు. అయితే వెంటనే తిరిగి ఎయిర్టెల్ అంతరాయానికి కారణాన్ని ప్రస్తావిస్తూ అధికారిక ప్రకటనలను విడుదల చేయాలని కోరారు.
ప్రజలకు ఇస్తానన్న హామీలేవీ రేవంత్?… ప్రజల్ని నిండా ముంచినావ్!