టీమిండియా యంగ్ ప్లేయర్ పృద్వి షా సెలెక్టర్ల పై సెటైరికల్ ట్విట్ చేశారు. జాతీయ జట్టుతో పాటు దేశి వాలి టీం లో కూడా పృద్విషాకు చోటు దక్కకపోవడంతో సెలెక్టర్లపై పరోక్షంగా స్పందించాడు. “మీరు నన్ను గేమ్ నుంచి తీసేయవచ్చు కానీ నా వర్క్ ని మాత్రం ఆపలేరు” అంటూ తన ఇన్స్టా స్టోరీలో పెట్టడం ప్రస్తుతం హైలైట్ గా నిలిచింది.
గేమ్ చేంజెర్ సినిమా లీక్ అవ్వడం బాధాకరము : నిర్మాత SKN
కాగా ఈ యంగ్ ప్లేయర్ తన ఫిట్నెస్ను మెరుగుపరుచుకునేందుకు కొన్ని వారాలుగా మైదానం మరియు జిమ్లో కసురత్తులు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక తాజాగా ఐపీఎల్లో కూడా పృద్విని ఏ జట్టు కూడా కొనుగోలు చేయని విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఒకప్పుడు ఈ యంగ్ క్రికెట్ ప్లేయర్ తన ఆట తీరుతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి చిన్న వయసులోనే ఐపిఎల్ లో అడుగుపెట్టడమే కాకుండా జాతీయ జట్టులో కూడా అడుగు పెట్టాడు. కానీ ప్రస్తుతం అతనికి గడ్డు పరిస్థితిలు ఎదురవుతున్నాయి. ఒకప్పుడు తనను మరో మహేంద్ర సింగ్ ధోనీలా ప్రతి ఒక్కరూ చూసేవారు. కానీ ప్రస్తుతం అతడిని కనీసం లీగ్ మ్యాచ్స్ కూడా తీసుకోవట్లేదు.