
Prisoner Rights: జైలు శిక్ష అనేది నేరం చేసిన వ్యక్తికి సమాజం విధించే శిక్ష. కానీ ప్రతి ఖైదీ ఒకే రకంగా ఆ శిక్షను స్వీకరించడు. కొంతమంది తము చేసిన తప్పులను అంగీకరించి శిక్ష అనుభవిస్తారు. అయితే మరికొందరు జైలు జీవితం భరించలేక తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు. సాధారణంగా ఒక ఖైదీ జైలు నుంచి పారిపోతే అదొక తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఆయనను వెతికి పట్టుకుని తిరిగి జైలుకే తీసుకువెళ్తారు. పైగా, పారిపోవడం అనే ప్రయత్నం చేసినందుకు కూడా అదనంగా శిక్ష విధించబడుతుంది. కానీ ప్రపంచంలోని కొన్ని దేశాలు మాత్రం ఈ విషయాన్ని పూర్తిగా భిన్నంగా చూస్తున్నాయి. ఆ దేశాలు ఖైదీ పారిపోవడాన్ని నేరంగా చెప్పడంలేదు. అంతేగాక, స్వేచ్ఛ కోసం చేసిన ప్రయత్నంగా అంగీకరించి, అతనిపై పెట్టిన శిక్షను కూడా రద్దు చేస్తాయి.
జర్మనీ, బెల్జియం, ఆస్ట్రియా, మెక్సికో, డెన్మార్క్ వంటి దేశాలు ఖైదీ పారిపోయే ప్రయత్నాన్ని నేరంగా పరిగణించవు. దీనికి ఒక తాత్విక, మానవతా దృక్పథం ఉంటుంది. ఈ దేశాలు ‘మనిషి స్వభావం స్వేచ్ఛను కోరుకోవడమే. స్వేచ్ఛ కోసం ప్రయత్నించడం తప్పుకాదు’ అనే భావనను నమ్ముతున్నాయి. ఒక మనిషి నిర్బంధంలో ఉన్నప్పుడు అతను బయటపడేందుకు ప్రయత్నించడం సహజమే. అందుకే జైలు గోడల నుండి బయటకు రావడానికి ఒక ఖైదీ చేసిన యత్నాన్ని అక్కడ నేరంగా పరిగణించరు. 1880లో జర్మనీ చట్టసభ్యులు ఈ ఆలోచనపై చట్టాన్ని రూపొందించారు. తరువాత ఈ విధానాన్ని మరికొన్ని దేశాలు స్వీకరించాయి.
అయితే ఇది పూర్తిగా స్వేచ్ఛా అనుమతి కాదు. కొన్ని ముఖ్యమైన షరతులు ఉన్నాయి. మొదటగా, ఖైదీ పారిపోవడం కోసం జైలు ఆస్తులను నాశనం చేయరాదు. గోడలు విరగకొట్టడం, తలుపులు పగలగొట్టడం, కిటికీలు ధ్వంసం చేయడం వంటి చర్యలు చేయరాదు. ఆస్తిని ధ్వంసం చేస్తే అది నేరమే అవుతుంది. రెండవది, ఖైదీ పారిపోవడంలో ఎవరినీ బందీలుగా చేసుకోరాదు. ఎవరినీ గాయపరచరాదు. ఎవరి సాయాన్ని పొందకూడదు. ఈ షరతులు ఉల్లంఘిస్తే ఖైదీ వెంటనే మళ్లీ పట్టుబడి కోర్టు ముందు హాజరై అదనపు శిక్షను పొందాల్సిందే.
అత్యంత విశేషమైన విషయం ఏమిటంటే.. ఖైదీ దుస్తులతో కూడ ప్రయాణించకూడదు. ఎందుకంటే ఆ దుస్తులు కూడా జైలు ఆస్తే. వాటిని తీసుకెళ్లడం ‘దోపిడీ’గా పరిగణించబడుతుంది. అంటే ఒక ఖైదీ పరారికి అవకాశమొస్తే అతను దుస్తులు కూడా విప్పేసి నగ్నంగా పారిపోవాలి. అంతేగాక పైన పేర్కొన్న అన్ని నియమాలను పాటించాలి. అప్పుడు మాత్రమే అతను శిక్ష నుండి బయటపడగలడు. లేకపోతే స్వేచ్ఛ కోసం చేసిన ప్రయత్నమే నేరమవుతుంది.
ఇన్ని షరతులు పెట్టడం వల్ల అసలు పారిపోవడం దాదాపు అసాధ్యం. ఇంత కఠినమైన నియమాలతో కూడా ఆ చట్టాన్ని కొనసాగిస్తుండటం వెనుక ఉన్న ఆలోచన స్పష్టమే. స్వేచ్ఛ మనిషి సహజ హక్కు. కానీ ఆ స్వేచ్ఛ కొద్ది నిమిషాలు మాత్రమే ఉన్నా కూడా, దానిని చేరడానికి చేసిన ప్రయత్నం నైతికతకు వ్యతిరేకం కాదని ఆ దేశాలు భావిస్తున్నాయి. అందుకే ఈ చట్టాలు మనకి విచిత్రంగా అనిపించినా, వాటి వెనుక ఉన్న తాత్వికత చాలా లోతైనది. నిజానికి ఈ విధానాల వల్ల పారిపోవడం జరిగే అవకాశాలు చాలా తక్కువ, కానీ మానవీయ దృక్పథం స్పష్టంగా కనిపిస్తుంది.
ALSO READ: CM Relief Fund: రేవంత్ సర్కార్ సరికొత్త రికార్డు.. బీఆర్ఎస్ హయాం కంటే రెట్టింపు





