Saturday, March 7, 2026
Homeక్రైమ్పూజల పేరుతో మహిళను మోసగించిన పూజారి - పరారీలో నిందితుడు సాయిరాజ్‌

పూజల పేరుతో మహిళను మోసగించిన పూజారి – పరారీలో నిందితుడు సాయిరాజ్‌

నాగోల్‌, క్రైమ్ మిర్రర్ : పూజల పేరుతో ఓ మహిళను మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగోల్‌కు చెందిన “శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం” పేరుతో పనిచేస్తున్న పూజారి సాయిరాజ్‌ మహిళను నమ్మించి లక్షల్లో మోసం చేసినట్లు తెలుస్తోంది.

బాధితురాలికి కుటుంబ సమస్యలు తీర్చిపెట్టుతానని నమ్మబలికిన పూజారి, పూజలు చేయాల్సిన అవసరం ఉందని చెబుతూ ఆమె నుండి రూ.32,000 నగదు, 5 తులాల బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. అనంతరం తప్పించుకొని పరారయ్యాడు.

ఈ ఘటనపై బాధితురాలు నాగోల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు సాయిరాజ్‌పై బిఎన్ఎస్ సెక్షన్లు 316(2), 318(4) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments