
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు జరుగుతుండగా త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగునున్నాయి. ఏపీలో మొత్తం 175 నియోజకవర్గాలు ఉండగా అన్ని నియోజకవర్గాల్లోని ఓటర్ల జాబితాను తాజాగా SEC సేకరించినట్లుగా సమాచారం అందింది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్స్ లు తెప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నట్లుగా సమాచారం. త్వరలో కూటమి ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేయగానే.. ఆ తర్వాత వెంటనే నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. కాగా 2021 ఫిబ్రవరి మరియు ఏప్రిల్ నెలలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. అప్పటి లాగానే ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉత్కంఠంగా సాగునున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో వార్డ్ మెంబర్ మొదలుకొని సర్పంచ్, ఎంపీటీసీ మరియు జెడ్పిటిసి వంటి వాటికి ఎలక్షన్స్ జరగనున్నాయి.
Read also : ఈనెల 26వ తేదీ నుంచి శుభకార్యాలు చేయొద్దు : వేద పండితులు
Read also : క్రైమ్ మిర్రర్ అప్డేట్: తెలంగాణాలో నేటి ముఖ్యమైన వార్తలు..!





