
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- సోషల్ మీడియాలో ప్రస్తుతం విమర్శలు చేస్తున్న వ్యక్తులలో… ప్రకాష్ రాజు ముందు స్థానంలో ఉంటారు. తాజాగా ఈసీ పై ప్రకాష్ రాజ్ తీవ్రంగా మండిపడ్డారు. మహిళల ప్రైవసీ కారణంగానే CCTV ఫుటేజ్ ఇవ్వలేమని ఈసీ చేసిన ప్రకటనపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీలు పెట్టేముందు మహిళల అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నించారు. మహిళల అనుమతి తీసుకోకుండానే సీసీటీవీలో ఏర్పాటు చేసినప్పుడు.. రాహుల్ గాంధీ వంటి నాయకులు సీసీటీవీ ఫుటేజ్ అడిగినప్పుడు ఎందుకు చూపించలేదని అన్నారు. పోలింగ్ బూత్ లు డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కాదు.. మీరు చెప్పే సాకులపై మాకు ఎటువంటి ఆసక్తి లేదు.. అని ప్రతి దాంట్లోనూ పారదర్శకత కావాలి అని సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. కాగా జరిగిన ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందని.. పోలింగ్ సీసీ టీవీ ఫుటేజ్ లను వెంటనే బయటపెట్టాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న సమయంలో ప్రకాష్ రాజ్ ఇలాంటి ట్వీట్ చేశారు.
Read also : తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షపాతాలు.. మునుపెన్నడూ లేని విధంగా?
కాగా ఎలక్షన్ల సమయంలో పోలింగ్ బూత్ లలో డబుల్ ఓటింగ్ జరిగింది అని, వెంటనే పోలింగ్ బూత్ల సీసీటీవీ ఫుటేజ్ లు ఇవ్వాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేయడంతో.. వెంటనే సిఇసి జ్ఞానేశ్ స్పందించారు. ప్రైవసీ కారణంగా మేము సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వలేము అని స్పష్టం చేశారు. వ్యక్తుల తల్లులు, కోడళ్ళు అలాగే సోదరీమణుల వీడియోలను ఈసీ ఇవ్వాలా?.. అని ప్రశ్నించారు. మేము సక్రమంగానే ఎలక్షన్ జరిపించామని.. ఓటరు జాబితాలో ఉన్న వారే ఎన్నికల్లో ఓటు వేస్తారని తెలిపారు. దేశంలో 1.3 కోట్ల బూత్ ఏజెంట్లు ఉంటే అవకతవకలు ఎలా జరుగుతాయని రాహుల్ గాంధీని ప్రశ్నించారు.
Read also : ఘనంగా జరిగిన తమ్మడపల్లి బోనాల పండగ