తెలంగాణ

సీఎం పై ప్రశంసలు.. ఇంటి కాంపౌండ్ ను కూల్చిన.. నోరు మెదపని ఫ్యామిలీ?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్ర ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో తెలంగాణలో చిన్న స్థలమైన కూడా కోట్లలో పలుకుతుంది కాబట్టి.. అధికారులు తమ యొక్క పలుకుబడి చూపించి పనులను అక్కడికక్కడే ఆపేస్తూ ఉంటారు. ముఖ్యంగా హైడ్రా విషయంలో చాలా మంది అధికారులు అనేక చోట్ల హైడ్రాకు లోకల్ లీడర్ లే అడ్డుపడ్డారు. వాళ్లకు తెలిసిన రాజకీయ నాయకులకు చెప్పి ఆపించే ప్రయత్నాలు కూడా మనం చూశాం. కానీ ఇలాంటి సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలామందికి ఆదర్శంగా నిలిచే పని చేశారు. రేవంత్ రెడ్డి పుట్టి పెరిగిన చిన్నప్పటి సొంత గ్రామం అయినటువంటి కొండారెడ్డిపల్లి లో… రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా అధికారులు సీఎం ఇంటి కాంపౌండ్ వాల్ ను కూలగొట్టడం జరిగింది.

Read also : ఉన్నట్టుండి రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ!.. ఏం కటౌట్ రా బాబు.. వర్కౌట్ అవుతుందా?

అధికారులు స్వయానా ముఖ్యమంత్రి సొంతింటి కాంపౌండ్ వాల్ ను కూలుస్తున్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటుగా అతని కుటుంబ సభ్యులు ఎవరూ కూడా అధికారులకు అడ్డు చెప్పలేదు. అధికారులు అన్నీ తెలిసే చేస్తారు కాబట్టి… వాళ్ళ పని వాళ్ళని చేసుకునేలా సహకరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లి లోని ఇంటి కాంపౌండ్ వాల్ ను కొంతమంది అధికారులు కూల్చుతున్న వీడియోలు అలాగే ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి తో పాటుగా తన కుటుంబ సభ్యులు కూడా అధికారులకు సహకరిస్తున్న సంఘటనను చూస్తున్న చాలా మంది నెటిజనులు రేవంత్ రెడ్డి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి కూల్చోద్దు అని ఒక్క సైగా చేస్తే అధికారులు అప్పటికప్పుడు పనులను ఆపి అన్ని సర్దుకుని బయలుదేరుతారు. కానీ రేవంత్ రెడ్డి అలా చేయలేదు. పూర్తిగా అధికారులకు సహకరించారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఇరు పార్టీలు కూడా ఇదే రేవంత్ అన్నకి, కెసిఆర్ కు ఉన్న తేడా అని సెటైర్లు వేస్తున్నారు.

Read also : తెలుగు రాష్ట్రాలకు దసరా సెలవులు.. అధికారులు ప్రకటించిన తేదీలు ఇవే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button