Wednesday, February 25, 2026
Homeసినిమామంచి మనసు చాటుకున్న ప్రభాస్..?

మంచి మనసు చాటుకున్న ప్రభాస్..?

క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్:- పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. సంక్రాంతి సందర్భంగా ప్రభాస్ నటించినటువంటి రాజా సాబ్ సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. రాజా సాబ్ సినిమా చూసినా ప్రతి ఒక్కరు కూడా డైరెక్టర్ మారుతి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా బాగాలేదు అంటూ.. ఫ్యాన్స్ చాలా గందరగోళం చేశారు. ఈ నేపథ్యంలోనే రాజా సాబ్ సినిమాకు భారీ నష్టాలు వచ్చాయి.

పులివెందుల‌లో కొన‌సాగుతున్న‌ ఏసీబీ అధికారుల సోదాలు…సీఐ, ఎస్సైల అరెస్టు

ఆ సినిమా నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ కు కూడా భారీగా నష్టాలు వాటిల్లడంతో ప్రభాస్ ఆ సంస్థకు మరొక సినిమా చేస్తానని స్వయంగా హామీ ఇచ్చినట్లుగా సినీ వర్గాలు ప్రకటించాయి. అంతేకాకుండా ఆ సినిమాకు ప్రభాస్ భారీగా రెమ్యూనరేషన్ తగ్గించుకుంటున్నట్లు కూడా మాటిచ్చారట. కాకపోతే ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ మరియు ఫౌజీ వంటి భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాతనే 2027 వ సంవత్సరంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా రాబోతున్నటువంటి సినిమాలో భాగమవుతారు అని సినీ వర్గాలు తెలిపాయి. దీంతో ప్రభాస్ మంచి మనసు మరోసారి బయటపడింది. ప్రభాస్ లాగానే మిగతా హీరోలు అందరూ కూడా నష్టపోయిన నిర్మాతలకు మరో అవకాశాలు ఇవ్వాలి అని, వారిని ఆదుకోవాలని.. అవసరమైతే రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకోవాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు.

శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి ఆలయంలో హుండీ చోరీ

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments