
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజుల నుంచి వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ ను వెళ్లి పరామర్శించారు. తాజాగా పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఆ తరువాత వైరల్ ఫీవర్ కారణంగా డాక్టర్ల సూచనల మేరకు విశ్రాంతి తీసుకునేందుకు హైదరాబాద్ వెళ్ళిపోయినట్లుగా జనసేన నాయకులు అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పై తాజాగా వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ కు వచ్చిన వైరల్ ఫీవర్ మామూలు జ్వరం కాదని.. అది ఇప్పట్లో తగ్గదులే అని అనుకుంటూ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు.
Read also : సినిమాలను వెంటాడుతున్న పైరసీ భూతం.. నిందితుడి సంపాదన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా పంచులు వేశారు. అయ్య బాబోయ్… ఇది మామూలు జ్వరం కాదండి!.. అంటూ విశాఖ ఉక్కును, మెడికల్ కాలేజీలను పూర్తిగా అమ్మేసే వరకు అతనికి జ్వరం తగ్గదు. ఆటో కార్మికులు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, పిఠాపురంలో మత్స్యకారులు, చిరు వ్యాపారులు, చిరంజీవి అభిమానులు శాంతించే వరకు కూడా ఈ పవన్ కళ్యాణ్ కు జ్వరం తగ్గదు అని ఎద్దేవా చేశారు. ఇక చివరిలో “గెట్ వెల్ సూన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు” అంటూ ముగించేసింది. అయితే ఈ విషయంపై తాజాగా జనసేన అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. గత ఐదేళ్ల కాలంలో మీ ప్రభుత్వ అధికారులు చాలానే ఎగరారని.. ఒకసారి తిరిగిస్తే తిరిగి కోలుకోలేని స్థితికి పోయారని రివర్స్ పంచులు వేస్తున్నారు.
Read also : నేడు ఈ 7 జిల్లాల్లో భారీ వర్షాలు…!