జాతీయం

దుర్గమ్మ ఆశీస్సులతో ప్రభాస్ కి పెళ్లి.. శ్యామలాదేవి

ప్రస్తుతం మన టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. ప్రభాస్ మన టాలీవుడ్ లోనే కాకుండా ఏకంగా భారతదేశంలోనే నెంబర్ వన్ హీరోగా కొనసాగుతూ ఉన్నాడు. ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలో 1000 కోట్లకు పైగా వసూలు రాబట్టిన సినిమాలలో ప్రభాస్ సినిమాలే ఎక్కువ.

అయితే ఇప్పటికీ 40 సంవత్సరాలు పైబడిన కానీ ప్రభాస్ కి మాత్రం ఇంకా పెళ్లి జరగలేదు. ఈ విషయంపై సర్వత్రా యావత్ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా నిత్యం మాట్లాడుకునే మాటలే. అయితే ప్రభాస్ తో పెళ్లి అంటూ చాలానే సోషల్ మీడియాలో ఇంతకుముందు పుకార్లు చాలా నడిచాయి. అయితే వాటన్నిటిని తిరస్కరిస్తూ ఇది నిజం కాదు అబద్ధం అని చెప్పుకుంటూ ప్రభాస్ కూడా కాలం గడిపేస్తున్నాడు. ప్రభాస్ ని మనం దగ్గరుండి చూస్తే చాలా మంచి వ్యక్తిలా అలాగే ఇతర హీరోయిన్లను కూడా చాలా గౌరవిస్తూ ఉండడం మనం చాలా సందర్భాల్లో చూసి ఉంటాం. ఒక ఇన్నోసెంట్ హీరో ఎవరు అంటే మనం టక్కున ప్రభాస్ అని చెప్పవచ్చు. అయితే ఎట్టకేలకు ఈ ప్రభాస్ పెళ్లి గురించి ప్రభాస్ యొక్క పెద్దమ్మ అప్డేట్ ఇచ్చారు.

Read More : ఎన్టీఆర్ కొడుకులు సినిమా రంగంలోకి అడుగుపెట్టే అవకాశాలు లేనట్టేనా…? ఎన్టీఆర్ స్పందన ఇదె!

ప్రస్తుతం దేవీ నవరాత్రులలో సందర్భంగా ప్రభాస్ పెద్దమ్మ అయినటువంటి శ్యామలాదేవి కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి విజయవాడ వచ్చారు. అక్కడ ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని అనంతరం మీడియా ముందు కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ప్రతి ఒక్కరిపై అమ్మవారు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు. అయితే అక్కడున్నటువంటి రిపోర్టర్లలో ఒకరు ప్రభాస్ కి పెళ్లి ఎప్పుడు జరుగుతుందని ఫ్యాన్స్ అందరు ఎదురు చూస్తున్నారు… దీని గురించి మీరు ఏమంటారు అని ఆమెని ప్రశ్నించారు. అయితే ఆమె వెంటనే దుర్గమ్మ ఆశీస్సులతో అలాగే కృష్ణంరాజు ఆశీస్సులతో కచ్చితంగా ప్రభాస్కి పెళ్లి జరుగుతుంది అని ఆమె మీడియా సమావేశంగా తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా తెగ సంబరపడిపోతున్నారు. వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలను చేస్తూ సులభంగా 1000 కోట్ల వసూలు రాబట్టే సత్తా ఉన్న ఏకైక హీరో ప్రభాస్ అని ఫ్యాన్స్ తెగ కామెంట్లు చేస్తున్నారు.

Back to top button