
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- మంచు విష్ణు అలాగే తన తండ్రి మోహన్ బాబు కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న చిత్రం కన్నప్ప. ఈ సినిమాలో మంచు విష్ణు తో పాటుగా రెబల్ స్టార్ ప్రభాస్ అలాగే మోహన్ లాల్ వంటి స్టార్ నటులు నటిస్తున్నారు. దాదాపుగా 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 25న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా ప్రభాస్ గురించి మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కన్నప్ప అనే చిత్రంలో ప్రభాస్ రుద్ర అనే శివుడు క్యారెక్టర్ లో నటించబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే తన క్యారెక్టర్ పై మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
“తల్లికి వందనం” పథకంపై కూటమి సర్కార్ కీలక నిర్ణయం..
కన్నప్ప సినిమాలో ప్రభాస్ కి స్లీవ్ లెస్ డ్రెస్ వేద్దామని మొదటగా అనుకున్నాం. కానీ ప్రభాస్ చాలా బక్కగా ఉండడంతో పాటుగా మంచి బాడీ ని కూడా మైంటైన్ చేయలేకపోయాడు అంటూ మంచు విష్ణు ప్రభాస్ ని తక్కువ చేసి మాట్లాడాడు. అంతటితో ఆగకుండా నా బాడీలో సగం బాడీ కూడా ప్రభాస్ లేదని అందుకే ఫుల్ లెన్త్ డ్రెస్ వేసామని చెప్పకు వచ్చాడు. దీంతో ఎన్నో ఏళ్ల తర్వాత మొదటిసారి పాన్ ఇండియా సినిమా చేస్తున్న నువ్వు ఎన్నో పాన్ ఇండియా సినిమాలు చేసి ఎన్నో రికార్డులు సృష్టించిన ప్రభాస్ ని తక్కువ చేసి మాట్లాడుతావా అని ప్రభాస్ అభిమానులు మంచు విష్ణు పై తీవ్రంగా మండిపడుతున్నారు. బాహుబలి సినిమాలో ప్రభాస్ బాడీని చూస్తే ప్రతి ఒక్కరూ శభాష్ అని అంటారు. ఆయనతో పోలిస్తే ప్రభాస్ కాలి గూటికి కూడా సరిపోడని అలాంటి ప్రభాస్ పై మంచు విష్ణు మాట్లాడడం సరికాదని విమర్శలు వెలువడుతున్నాయి.
ఉస్మానియా జోలికొస్తే బొందపెడతం.. సీఎం రేవంత్‌కు బీజేపీ వార్నింగ్