
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం “బాహుబలి ది ఎపిక్” ప్రచారంలో భాగంగా జపాన్ వెళ్లిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రభాస్ జపాన్ పర్యటన చేస్తు బిజీగా ఉండగా.. మరోవైపు నిన్న సాయంత్రం జపాన్ దేశంలో భారీ భూకంపం ప్రకంపనలు వచ్చాయి అని వార్తలు వచ్చాయి. అయితే భారీ భూకంపం సంభవించిన వేళ జపాన్ లో ప్రభాస్ ఎలా ఉన్నారు అని డార్లింగ్ అభిమానులు అందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రభాస్ భూకంపం లో ఇరుక్కున్నారు అంటూ.. ప్రభాస్ గురించి అప్డేట్ కావాలి అని నిన్నటి నుంచి ప్రభాస్ అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ ఉన్నారు.
Read also : Hot News: కవిత కుక్క పేరు కూడా విస్కీ-ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ మారుతి వేగంగా స్పందించారు. నేను నిన్న జపాన్ లో భూకంపం వార్తలు రాగా వెంటనే ప్రభాస్ కు ఫోన్ చేసి ఆరా తీశాను అని.. ప్రభాస్ సురక్షితంగానే ఉన్నారని తెలిపారు. దీంతో డార్లింగ్ అభిమానులు అందరూ కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని డైరెక్టర్ మారుతి స్పష్టం చేశారు. దీంతో డార్లింగ్ అభిమానులు అందరూ కూడా మారుతి అప్డేట్ తో హమ్మయ్య అని సంతృప్తి చెందుతున్నారు. కాగా జపాన్లో నిన్న రాత్రి 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాంతో చాలా ఇల్లు మరియు భవనాలు అలాగే మెట్రో స్టేషన్లతో సహా చాలానే ఊగిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందర్భంగా ప్రభాస్ కూడా జపాన్ పర్యటనలో ఉండడంతో అభిమానులు అందరూ కూడా ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ మారుతి ప్రభాస్ క్షేమంగానే ఉన్నారని తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Read also : హైదరాబాదులో అడుగుపెట్టనున్న మెస్సి.. పూర్తి వివరాలు ఇవే?





