ఆంధ్ర ప్రదేశ్రాజకీయం

టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు - టెన్షన్‌లో చంద్రబాబు..!

టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుతోంది. రోడ్డెక్కి రచ్చరచ్చ చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. మంత్రుల ముందే దాడులకు దిగుతున్నారు. చొక్కాలు పట్టుకుని… తన్నుకుంటున్నారు. మీటింగ్‌ పెడితే చాలు.. నేతల మధ్య ఫైటే హైలెట్‌ అవుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్రం కావడంతో… ఏం చేయాలో పాలుపోక… టీడీపీ హైకమాండ్‌ తలలు పట్టుకుంటోంది.

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు టీడీపీలోనూ వర్గపోరు రచ్చకెక్కింది. రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ ముక్కా రూపానందరెడ్డి, పార్టీ నేత విశ్వనాథనాయుడు మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. విశ్వనాథనాయుడు ముందు నుంచి టీడీపీలో ఉండి పార్టీ కోసం పనిచేశారు. కానీ… ముక్కా రూపానందరెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరి… నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు చేపట్టారు. దీంతో… విశ్వనాథనాయుడు అసంతృప్తితో రగిలిపోతున్నారు. రైల్వేకోడూరులో జనసేన ఎమ్మెల్యే శ్రీధర్‌.. రూపానందరెడ్డి వర్గం. దీంతో… విశ్వనాథనాయుడు వర్గాన్ని పూర్తిగా పక్కనపెట్టేశారు. ఈ కోపం… మంత్రి జనార్థన్‌రెడ్డి రైల్వేకోడూరు పర్యటనలో బయటపడింది. మంత్రి వెళ్లే సమయానికి టీడీపీ ఆఫీసు అద్దాలు, కుర్చీలను ధ్వంసం చేశారు. అంతేకాదు మంత్రి కళ్ల ఎదుటే కొట్టుకున్నారు కూడా. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఒక కానిస్టేబుల్‌కి కూడా గాయాలయ్యాయి. అంటే రైల్వేకోడూరులో ఆధిపత్య పోరు ఏ స్థాయిలో ఉందో ఈ గొడవతో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది.


Also Read : బీజేపీలోకి విజయసాయిరెడ్డి ఎంట్రీ – జాయినింగ్‌ ఎప్పుడంటే..!


రైల్వేకోడూరు మాత్రమే కాదు… మొన్నటి మొన్న పులివెందుల టీడీపీలోనూ ఇలాగే జరిగింది. జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి సవిత సంక్షేమంలోనే బీటెక్‌ రవి, ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి వర్గీయులు గొడవ పడ్డారు. మంత్రి సమక్షంలో జరుగుతున్న సమావేశానికి రాంగోపాల్‌రెడ్డి రావడాన్ని… బీటెక్‌ రవి వర్గానికి చెందిన వేముల టీడీపీ ఇన్‌చార్జ్‌ పార్థసారధిరెడ్డి వర్గం సహించలేకపోయింది. రాంగోపాల్‌రెడ్డిపై దాడికి దిగింది. రాంగోపాల్‌రెడ్డి వైసీపీకి ఫేవర్‌గా ఉంటున్నారని… టీడీపీ నేతల పనులకు అడ్డుపడుతున్నారని పార్థసారధిరెడ్డి వర్గీయుల ఆరోపణ. అయితే మంత్రి సవిత ఇరువర్గాల వారికి సర్దిచెప్పారు.


Also Read : జానారెడ్డి ఎవడు.. నేనే తోపు.. మంత్రిపదవి ఇవ్వకుంటే అంతే..!


రైల్వేకోడూరు, పులివెందులలో కాదు… గుంటూరు, మదనపల్లె… ఇలా చాల నియోజకవర్గాల్లో టీడీపీలో వర్గపోరు నడుస్తోంది. తెలుగు దేశం పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి… ఒకరిపై ఒకరు కత్తులు నూరుతున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే… టీడీపీకి నష్టమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. కూటమిలో మూడు పార్టీలు కలిసి పనిచేయాలని సీఎం చంద్రబాబు పదే పదే చెప్తుంటారు. మూడు పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేయడం కాదు… ముందు, సొంత పార్టీ గొడవలు లేకుండా చూసుకోవాలని టీడీపీ హైకమాండ్‌కు చాలా మంది హితవు పలుకుతున్నారు.

ఇవి కూడా చదవండి .. 

  1. తెలంగాణలో ఫ్రూట్ జ్యూస్‌ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం.

  2. మర్రిగూడ ఎంపిడివో రాజకీయం..!రాజకీయంగా మారిన కరువు పని? 

  3. కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!

  4. కోమటిరెడ్డిపై గుత్తా తిరుగుబాటు.. రెండుగా చీలిన నల్గొండ కాంగ్రెస్?

  5. ఆస్తి కోసం కూతురును చంపి సవతి తల్లి.. నదిలో పాతి పెట్టిన వైనం!..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button