ఆంధ్ర ప్రదేశ్

నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్ టాప్.. అదరగొట్టిన పవన్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అరుదైన చోటు దక్కింది. గూగుల్ సెర్చ్ టాప్ 5 లో పవన్ కళ్యాణ్ నిలిచారు. 2024లో ఇండియన్స్ అత్యధికంగా వెతికిన అంశాలను వెల్లడించింది గూగుల్. ఎక్కువ మంది సెర్చ్ చేసిన పర్సన్స్ జాబితాలో వినేష్ ఫొగాట్ , బీహార్‌ సీఎం నితీష్ కుమార్, కేంద్రం మంత్రి చిరాగ్‌ పాళ్వాన్ , క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా టాప్ నాలుగు ప్లేస్లుల్లో ఉన్నారు. ఐదవ స్థానంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలిచారు.

2024లో గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన అంశాలపై ఓ నివేదికను విడుదల చేశారు. ఇందులో వ్యక్తుల విషయానికి వచ్చేసరికి పవన్ కల్యాణ్ టాప్ ఫైవ్ లో ఉన్నారు. దేశవ్యాప్తంగా సెర్చింగ్‌లో పవన్ టాప్‌లో ఉండటం సంచలనంగా మారింది. ఈ ఏడాదంతా పవన్ కల్యాణ్ వార్తల్లోనే ఉన్నారు. చంద్రబాబు అరెస్టు దగ్గర నుంచి అన్నీ పవన్ కల్యాణ్ చుట్టూనే తిరుగుతున్నాయి. టీడీపీతో పొత్తులు ప్రకటించడం.. ప్రచారం.. ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉండటం వరకూ అనేక అంశాలపై పవన్ కీలకంగా మారారు.

ఏపీలో ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత ఆయన రోల్ పై చర్చ జరిగింది. ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హిందూత్వ వాదం మీద ఆయన తీసుకున్న స్టాండ్ కూడా హైలెట్ అవుతోంది. మహారాష్ట్ర ప్రచారం.. ఉదయనిధి సనాతన ధర్మంపై చేసిన విమర్శలకు కౌంటర్లు ఇలా .. పవన్ ఈ ఏడాది ప్రతి విషయంలోనూ హాట్ టాపిక్ అయ్యారు. ఆయన కోసం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనేకాదు.. దేశవ్యాప్తంగా సెర్చ్ చేశారు. ట్రెండ్స్ అదే చెబుతున్నాయి.పవన్ కల్యాణ్ ఈ ట్రెండ్స్ ను సినిమాల ద్వారా సాధించలేదు. రాజకీయాల ద్వారా సాధించారు. పదేళ్ల పాటు కష్టపడిన తర్వాత రాజకీయంగా వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయాలతో ఆయన తన భావజాలంతో నేషనల్ హాట్ టాపిక్ అయ్యారు.

భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేసింది క్రికెట్‌ అభిమానులు ఎంతో ఇష్టపడే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ గురించి. గూగుల్‌ ఓవరాల్‌ జాబితాలో ఈ ఐపీఎల్ టీ20 టోర్నీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు 2024లో భారతీయులు అత్యధికంగా వెతికిన అంశాల జాబితాను గూగుల్ విడుదల చేసింది. ఈ ఏడాది అత్యధికంగా వెతికన వాటిల్లో ఐపీఎల్‌, టీ20 వరల్డ్‌ కప్‌తో పాటు సార్వత్రిక ఎన్నికలు వంటి అంశాలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం దివంగతులైన టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటా గురించి కూడా ఎక్కువగా నెటిజన్లు సెర్చ్ చేశారు.సినిమాల విషయానికొస్తే స్త్రీ2 గురించి ఎక్కువ మంది ఆరా తీయగా.. ప్రభాస్‌ నటించిన కల్కి, సలార్‌ గురించి ఎక్కువ మంది సెర్చ్‌ చేశారు. వీటితో పాటు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా నటించిన తెలుగు సినిమా హనుమాన్‌ మూవీ కూడా అన్వేషించిన జాబితాలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button