
క్రైమ్ మిర్రర్, శంకర్ పల్లి :- 15సంవత్సరాల తర్వాత జీవితంలో స్థిరపడి ఒకే వేదికపై అందరూ చిన్ననాటి తరగతిగది చిలిపి చేష్టలను నెమరు వేసుకున్నారు.రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం పర్వేద
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2009-2010 సంవత్సరంలో పదవ తరగతి చదివి తదనంతరం వారి వారి వృత్తి,ఉద్యోగాలలో స్థిరపడిపోయారు. అయితే వారంతా ప్రస్తుతం ఒకే వేదికపై జడ్.పి.హెచ్.ఎస్ పర్వేద స్కూల్ లో ఏర్పాటు చేసుకున్న ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకొని తమ చిన్ననాటి అనుభవాలను వేదికపై పంచుకున్నారు. పాఠశాలలోని తరగతి గదిలో జరిగిన సంఘటనలను పూర్వ ఉపాధ్యాయులు,పూర్వ విద్యార్థుల సమక్షంలో వారి వారి అభిప్రాయాలను పంచుకొని ఆనందంగా గడిపారు.
వర్కాల సూర్యనారాయణను సన్మానించిన గ్లోబల్ బిజినెస్ నెట్‌వర్క్!.
15సంవత్సరాల అనంతరం ఇలా అందరూ ఒకే వేదికపై కలుసుకోవడం సంతోషంగా ఉందని వారి వారి అభిప్రాయాలలో వెలి బుచ్చారు.అప్పట్లో ఉపాధ్యాయులుగా పనిచేసిన కొందరు మాట్లాడుతూ15 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనంత కిషన్ రావు సార్,అనిల్ కుమార్ సార్, రవీందర్ సార్, నరసింహ సార్, గోపాల్ సార్, సుధాకర్ సార్, వెంకటేశం సార్, గోపాల్ సార్, శ్రీరాములు సార్, వెంకటేశం సార్, లక్ష్మణ్ సార్, విజయ భాస్కర్ సార్, రామ్ చందర్ సార్, వెంకటేశం సార్, సంధ్యారాణి మేడం, శ్రీదేవి మేడం, సీతా మహాలక్ష్మి మేడం, అనుపమ మేడం, ఉమామహేశ్వర్ సార్ టీచర్స్ విద్యార్థులు అందరూ పాల్గొని పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేశారు.