
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:-
వేసవికి ముందే కరెంటుకు డిమాండ్ పెరిగిపోతోంది. గత పది సంవత్సరాలుగా ఎప్పుడు లేని కరెంటు పోతలు మళ్లీ మొదలయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యుత్ కోతలు ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. దాదాపు ప్రతిరోజూ మెయిన్ టెయిన్స్ పేరిట ఒక్కో ఏరియాలో మూడు నుంచి నాలుగు గంటల పాటు కరెంటు కోతలు విధిస్తున్నారు. ఈమేరకు విద్యుత్ అధికారులు కూడా ప్రకటనలు చేస్తున్నారు. చెట్ల నరికివేత, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు అంటూ కరెంటు కోతలు అమలు చేస్తున్నారు. ఫిబ్రవరిలో నుండే ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడం, యాసంగి పంటల సాగు పుంజుకోవడంతో విద్యుత్ డిమాండ్ మరింత ఎక్కువవుతోంది. కరెంట్ డిమాండ్ ఎంత పెరిగినా సరఫరా చేసేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీగా 270 మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగం జరుగుతోంది. రోజు రోజుకూ కరెంటు వాడకం పెరిగిపోతోంది. ఇందులో 90 మిలియన్ యూనిట్లకుపైగా తెలంగాణ జెన్‌కో ఉత్పత్తి చేస్తుండగా, సింగరేణి 26 మిలియన్ యూనిట్లు, సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల నుంచి 129 మిలియన్ యూనిట్లు, నేషనల్ పవర్ ఎక్చేంజీ నుంచి 42 మిలియన్ యూనిట్లు, ఇలా రోజువారిగా 287 మిలియన్ యూనిట్ల దాకా సేకరిస్తున్నారు. ఈ కరెంటుతో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
విజయ్ సాయి రెడ్డికి తీరని కష్టాలు!… మరోసారి నోటీసులు ఇచ్చిన సీఐడీ
తెలంగాణలో కరెంటు కోతలు తప్పవు… చేసుకున్న వాడికి చేసుకున్న మా దేవా అన్నట్టు తెచ్చుకున్న కాంగ్రెస్తో ప్రజలు ఇబ్బందులు పడక తప్పదు