
– ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు వంకలు
– పలు జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు
– నిండుకుండలా మారిన మేడిగడ్డ బ్యారేజ్
– పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారుల హెచ్చరికలు
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:-
గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పశ్చిమ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాలకు అరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ తో పాటు మిగతా జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండడంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. అప్పుడప్పుడు జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మేడిగడ్డ బ్యారేజ్ పరిసర ప్రాంత ప్రజలకు హెచ్చరిక
మహాదేవ్ పూర్ మండలంలోని అంబట్‌పల్లి గ్రామంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా మహారాష్ట్రలోని ప్రాణహిత నది, తెలంగాణలోని గోదావరి నదుల ప్రవాహం గత వారం రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తోంది. దీంతో బ్యారేజ్ లోని మొత్తం ఎనిమిది బ్లాక్ లలో ఉన్న 85 గేట్లను ఎత్తి అంతే మొత్తంలో వరద ప్రవాహాన్ని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. బరాజ్ లో ప్రస్తుత వరద ప్రవాహం సముద్ర మట్టానికి 90 మీటర్ల ఎత్తులో ఉందని వర్షాల కారణంగా బ్యారేజ్ కు వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. గోదావరి పరివాహక గ్రామాలైన అంబటిపల్లి, పెద్దంపేట, లెంకలగడ్డ తో పలు గ్రామాల ప్రజలకు అధికారులు పలు సూచనలు చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ లో గేట్లు అన్ని ఎత్తివేయడం జరిగిందని, గోదావరి లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని, ఇతరులు ఎవరు గోదావరి స్నానాలకు వద్దకు వెళ్లకూడని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
మా అన్న పవన్ కళ్యాణ్ సినిమా కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నా : నారా లోకేష్