తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఆయనకు వ్యతిరేకంగా ఏకంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం దగ్గర పోస్టర్లు వెలిశాయి. ఏఐసీసీ కార్యాలయం పరిసరాల్లో తెలంగాణ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, ఆయన ఏడాది పాలన తీరుపై వందలాది పోస్టర్లు రాత్రికి రాత్రే వెలిశాయి. ఏకంగా కాంగ్రెస్ ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయం వద్ద కనిపించిన రైతు భరోసా పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.
రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి వరంగల్ డిక్లరేషన్ పేరు మీద తెలంగాణ రైతులకు ఎకరానికి 15000 రూపాయలు చొప్పున ఇస్తామని ప్రకటించి, కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత 2024 సంవత్సరంలో రైతులకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం, ఇటీవల సీఎం రేవంత్ యూటర్న్ తీసుకుంటూ ఎకరాకు 15000 ఇవ్వమని ప్రకటించడంపై ఏకంగా ఏఐసీసీ కాంగ్రెస్ కార్యాలయం వద్ద “కాంగ్రెస్ రైతు భరోసా యూటర్న్” పేరుతో పోస్టర్లు అంటించారు.