ఆంధ్ర ప్రదేశ్

తాళ్లరేవు పోస్టాఫీసులో ఉద్యోగి నిర్వాకం...ఫోన్‌లో అశ్లీల వీడియోలు

డ్యూటీ సమయంలో ఫోన్‌లో అశ్లీల వీడియోలు…

గంటల తరబడి వేచి వున్నా ప్రజలు

క్రైమ్ మిర్రర్, కాకినాడ జిల్లా : ప్రజలకు సేవలు అందించాల్సిన పోస్టాఫీసులోనే ఉద్యోగి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. తాళ్లరేవు మండలంలోని ఒక గ్రామం బ్రాంచ్ పోస్టాఫీసులో విధులు నిర్వహిస్తున్న బ్రాంచ్ పోస్టుమాస్టర్, డ్యూటీ సమయాల్లోనే మొబైల్ ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూస్తున్నాడని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పోస్టాఫీసుకి వచ్చి పనులు చేయించుకునేందుకు వచ్చిన ప్రజలు గంటల తరబడి బయటే వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. కంప్యూటర్లు పని చేయడం లేదు… లింక్ లేదు… అంటూ సేవలను నిలిపివేస్తున్న ఉద్యోగి, లోపల కూర్చొని మొబైల్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ కనిపించాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Also Read:అంతా ముగిసింది అనుకునే లోపే మరోసారి దాడులు!

ఈ విషయాన్ని పలువురు మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి ఉన్నతాధికారులకు పంపించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ సేవల పట్ల ఉద్యోగి చూపుతున్న నిర్లక్ష్యం, ప్రజల సమయాన్ని వృథా చేయడమే కాకుండా, శాఖ ప్రతిష్టను దిగజార్చేదిగా ఉందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోస్టల్ డిపార్ట్‌మెంట్ అధికారులను స్థానికులు కోరుతున్నారు.

Also Read:New Aadhaar: త్వరలో కొత్త ఆధార్‌.. దీని ప్రత్యేక ఏంటంటే?

Back to top button