
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీనే ఘన విజయం సాధిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ జోష్యం చెప్పారు. నేడు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి.. కంటోన్మెంట్ లో జరిగిందే ఈ జూబ్లీహిల్స్ లోనూ అదే రిపీట్ అవుతుందని ఒక వ్యాఖ్యలు చేశారు. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విషయంలో బిఆర్ఎస్ పార్టీ ఇంకా కూడా అపోహాల్లోనే బతుకుతుంది అని చెప్పుకొచ్చారు. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడిన కాంగ్రెస్ విజయాన్ని మాత్రం ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలలో భారీ ఎదురు దెబ్బ తగులుతుందని.. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ కి ఓటమి ఖాయమని అన్నారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ఆశీర్వాదంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని పొన్నం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో మేమే గెలుస్తామంటూ వారు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటువైపు కాంగ్రెస్ పార్టీ కూడా మేమే గెలుస్తామని ఇరు పార్టీలు సవాల్ విసురుకుంటున్నారు. మరి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో ఎవరు గెలుస్తారని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో పాటు నాయకులు కూడా ఎదురుచూస్తున్నారు. మరి మీరు ఏ పార్టీ గెలుస్తుందో కామెంట్ చేయండి.
Read also : డిప్యూటీ సీఎం బాధ్యతలు పక్కనపెట్టి.. బాగా నటించినట్టున్నావ్ : అంబటి రాంబాబు
Read also : శ్రీశైలం అటవీ ప్రాంతంలో ఎన్ని పులులు ఉన్నాయో తెలుసా?