Friday, March 20, 2026
Homeజాతీయంసెప్టెంబరు 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక, ధన్‌ఖడ్‌ ప్లేస్ లో వచ్చేదెవరో?

సెప్టెంబరు 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక, ధన్‌ఖడ్‌ ప్లేస్ లో వచ్చేదెవరో?

Vice President Election: కొత్త ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఎన్నిక జరపనున్నట్లు ప్రకటించింది. జగదీప్‌ ధన్‌ ఖడ్ రాజీనామాతో ఈసీ ఎన్నికకు రంగం సిద్ధం చేస్తోంది.  పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలైన తొలి రోజే ధన్‌ ఖడ్ తన పదవికి రిజైన్ చేశారు.ఆరోగ్య సమస్యల కారణంగానే రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ పంపారు. 2022 ఆగస్టు 11న ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు 2027 ఆగస్టు వరకూ పదవీకాలం ఉంది. అయినా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ధన్‌ఖడ్‌ తర్వాత ఉప రాష్ట్రపతిగా ఎవరిని ఎన్నుకుంటారనేది ఇప్పుడు ఆక్తికరంగా మారింది.

ఆగస్టు 7న నోటిఫికేషన్ జారీ

ఈ నెల 7న ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ జారీ అవుతుంది. అదే రోజు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. 21 వరకు నామినేషన్లకు గడువు ఉంటుంది. 22న నామినేషన్లు పరిశీలిస్తారు. 25 వరకు పోటీ నుంచి ఉపసంహరించుకునేందుకు గడువు ఇస్తారు. వచ్చే నెల 9వ తేదీన పోలింగ్‌ జరుగుతుందని ఈసీ తెలిపింది. షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబరు 9న పార్లమెంటు భవనం మొదటి అంతస్తులో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. అదే రోజు ఓట్లు లెక్కించి ఫలితం ప్రకటిస్తారు.

ఉపరాష్ట్రపతి రేసులో పలువురు నాయకులు

ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీయే కూటమి.. ఎవరిని ఎంపిక చేస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రేసులో పలువురి పేర్లు తెర పైకి వచ్చాయి. బీహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌, జేడీయూ నేత హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌, కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ సహా పలువురు నేతల పేర్లు ఉప రాష్ట్రపతి రేసులో ఉన్నాయి.

Read Also: ట్రంప్ సీరియస్ కామెంట్స్.. భారత్ కూల్ రియాక్షన్!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments