Friday, March 20, 2026
Homeఆంధ్ర ప్రదేశ్ఆంధ్రాలో అగ్గిరాజుకుంటున్న రాజకీయాలు, నాయకుల ఇళ్లపై దాడులు.. ప్రస్తుత పరిస్థితి ఏంటి?

ఆంధ్రాలో అగ్గిరాజుకుంటున్న రాజకీయాలు, నాయకుల ఇళ్లపై దాడులు.. ప్రస్తుత పరిస్థితి ఏంటి?

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార మరియు ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ వైరం రోజురోజుకు కూడా పెరుగుతూ పోతుంది. తాజాగా వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో కూటమి నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆగ్రహంతో అంబటి రాంబాబు ఇంటిని ధ్వంసం చేశారు. ఇక మరుసటిరోజు మరో వైసీపీ నాయకుడు అయినటువంటి జోగి రమేష్ ఇంటిపై కూడా టిడిపి కార్యకర్తలు దాడులు చేశారు. ఈ విషయం ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం మారగా ఒక్కొక్కరు స్పందిస్తూ వస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రాబోయే ఎలక్షన్లలో ఒకవేళ అధికారం మారితే వారు కూడా చర్యకు ప్రతి చర్యలు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దాడులు పై స్పందిస్తూ కూటమిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మరోవైపు జోగి రమేష్ కూడా స్పందిస్తూ వైఎస్ జగన్ రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాగా దాడులకు పాల్పడుతున్నారా అని కూటమిపై మండిపడ్డారు. ఇక ఏపీలో ఏకంగా రాష్ట్రపతి పాలన పెట్టాలి అని జోగి రమేష్ వ్యాఖ్యానించారు. వెంటనే రాష్ట్రానికి కేంద్ర బలగాలను పంపాలి అని లేదంటే వేలాదిమంది ప్రాణాలకు ముప్పు అని జోగి రమేష్ అన్నారు. వైసిపి నాయకులు ప్రతి ఒక్కరు కూడా చర్యకు ప్రతి చర్య కచ్చితంగా ఉంటుంది అనే విధంగా మాటలు మాట్లాడుతున్నారు.

Read also : హైడ్రా (HYDRAA) విభాగంలో 20 మంది ట్రాన్స్‌జెండర్ల కు హోంగార్డు ఉద్యోగాలు

Read also : మంచు దుప్పటి కమ్ముకున్న తుక్కుగూడ.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహన దారులు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments