* సి ఓటర్ ఒపీనియన్ పోల్స్ లో సంచలన ఫలితాలు
* హోరా హోరీగా సాగుతున్న అసెంబ్లీ ఎన్నికలు
క్రైమ్ మిర్రర్, ఎలక్షన్ డెస్క్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? బహుముఖ పోటీలో కలిసొచ్చేది ఎవరికి? ఎవరి ఓట్లు ఎవరు చీల్చుతారు? ఇప్పుడు ఉన్న అధికార పార్టీలే మరోసారి అధికారం చేపడతాయా? లేకుంటే విపక్షాలు అధికారంలోకి వస్తాయా? సర్వత్ర దీనిపైనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే ప్రిపోల్ సర్వేలతో సంస్థలు హల్చల్ చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో సీ ఓటర్ సంస్థ తన సర్వే ఫలితాలను వెల్లడించింది. ఒపీనియన్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నాయో ప్రకటించింది.
* ప్రస్తుతం తమిళనాడులో హోరాహోరీగా పోరు కొనసాగుతోంది. ఇక్కడ త్రిముఖ పోరు ఉంది. అయితే తాజా సర్వే ప్రకారం అధికార డిఎంకె ముందంజలో ఉంది. 41%తో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అన్నాడీఎంకే కూటమి కూడా గట్టి పోటీ ఇస్తోంది. 38 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉంది. విజయ్ కొత్త పార్టీ టీవీ కేకు కనీస స్థాయిలో ఓట్లు మాత్రమే దక్కుతాయని తేలింది. సీట్లు విషయంలో మాత్రం పెద్దగా అవకాశాలు కనిపించడం లేదు.
* పశ్చిమ బెంగాల్లో పి ఎం సి వర్సెస్ బిజెపి అన్నట్టు పరిస్థితి ఉంది. కానీ తాజా సర్వే ప్రకారం పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ముందంజలో ఉంది. 44 శాతం ఓట్లతో బలంగా కనిపిస్తోంది. మరోసారి అధికారంలోకి వచ్చేలా ఉంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ 40 శాతం ఓటు బ్యాంకుతో గట్టి పోటీ ఇస్తోంది. అయితే ఇక్కడ లెఫ్ట్ పార్టీలతో పాటు కాంగ్రెస్ నామమాత్రం గానే ఉన్నట్లు స్పష్టమవుతోంది.
* మరోవైపు అస్సాంలో మరోసారి భారతీయ జనతా పార్టీ అధికారం చేజిక్కించుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక్కడ బిజెపికి ఏకంగా 48% జై కొట్టడం విశేషం. కాంగ్రెస్ కూటమి మాత్రం 35 శాతం ఓట్లు కె పరిమితం అయినట్టు కనిపిస్తోంది.
* కేరళలో ఈసారి అధికార మార్పిడి తప్పెలా లేదు. అధికార ఎల్డీఎఫ్ కు 36% మంది మాత్రమే జై కొట్టారు. విపక్ష యు డి ఎఫ్ కు 40 శాతం ఓట్లు దక్కేలా ఉన్నాయి. మొత్తానికైతే సి ఓటర్ ఒపీనియన్ పోల్ సంచలన సర్వే ఫలితాలను వెల్లడించింది.
