Monday, March 16, 2026
Homeఆంధ్ర ప్రదేశ్YSRCP’s Iftar: వైసిపికి ఇఫ్తార్ విందు షాక్.. పార్టీ పరువు గంగపాలు!

YSRCP’s Iftar: వైసిపికి ఇఫ్తార్ విందు షాక్.. పార్టీ పరువు గంగపాలు!

* గుంటూరులో చివరి నిమిషంలో కార్యక్రమం వాయిదా

* నేతల మధ్య విభేదాలు కారణం

క్రైమ్ మిర్రర్, గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని ఇబ్బందులే. ఇప్పటికే ఆ పార్టీ కష్టకాలంలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నేతల మధ్య ఐక్యత ఉండాల్సింది పోయి విభేదాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా గుంటూరు వైసీపీలో కోల్డ్ వార్ నడుస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇటీవల గుంటూరులో జగన్మోహన్ రెడ్డి ఓ భారీ కార్యక్రమానికి ప్లాన్ చేశారు. కానీ ముందు రోజు రాత్రి ఆ కార్యక్రమం వాయిదా పడింది. రెండు రోజుల తర్వాత ఆ కార్యక్రమం విజయవాడలో చేపట్టారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య విభేదాలతోనే ఈ కార్యక్రమం వాయిదా పడినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ కష్ట కాలంలో ఉంటే ఈ విభేదాల పర్వం ఆ పార్టీలో కలవరానికి కారణం అవుతోంది. కొంతమంది నేతల తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

గుంటూరులో తారాస్థాయి విభేదాలు..

మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఒకవైపు పార్టీని బలోపేతం చేస్తూనే ఇంకోవైపు నియోజకవర్గాల్లో కీలక మార్పులు దిశగా అడుగులు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి సమయంలో అధినేతకు అండగా.. పార్టీకి మద్దతుగా నిలవాల్సిన నేతలు అడ్డగోలుగా చీలుతున్నారు. విభేదాలతో పార్టీ ప్రతిష్టను మంటగలుపుతున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఒకలా ఉంటే గుంటూరు వైసీపీలో మాత్రం నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయనే  టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా గుంటూరు నగర వైసీపీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు పరిస్థితి ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అసలే మాజీమంత్రి అంబటి రాంబాబు అరెస్టుతో పరిస్థితి మారింది గుంటూరు నగరంలో. ఇటువంటి తరుణంలో గుణపాఠాలు నేర్చుకోవాల్సింది పోయి నేతలు అంతర్గత కలహాలతో ముందుకు సాగుతుండడం విమర్శలకు తావిస్తోంది.

ఓ మహిళా నేత ఆరాటం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఇఫ్తార్ విందు గుంటూరులో ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఎందుకంటే అక్కడ ముస్లిం ప్రాబల్యం ఎక్కువ. ఆ పార్టీ నుంచి బలమైన ముస్లిం నేతలు కూడా అక్కడ ఉన్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు వైసీపీలో మైనారిటీ నేతలు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి హాజరవుతారు అంటూ ప్రకటించారు. కానీ ఉన్నఫలంగా ఆ కార్యక్రమం వాయిదా పడింది. అప్పటివరకు గుంటూరుకు జగన్ వస్తున్నారంటూ వైసీపీ సోషల్ మీడియా తెగ ప్రచారం చేసింది. గుంటూరు నగరవ్యాప్తంగా భారీ ఫ్లెక్సీలు కూడా వెలిసాయి. కానీ ఉన్నఫలంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ నిర్ణయం ప్రకటించారు. ఇఫ్తార్ విందు ప్రకటనను మరోసారి చేస్తామని చెప్పుకొచ్చారు. దీంతో ఇది చర్చకు దారితీసింది. గుంటూరులో నేతల మధ్య విభేదాలతోనే ఇఫ్తార్ విందును వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

చివరి నిమిషంలో వాయిదా..

గుంటూరులో ఇఫ్తార్ విందు ఏర్పాటు వెనుక ఓ కీలక నేత ఉన్నారు. కానీ ఆయనను సైడ్ చేసి కార్యక్రమాన్ని తానే నిర్వహిస్తున్నట్లు ఓ మహిళ నేత ప్రకటించుకోవడంతో విభేదాలు తలెత్తాయి. ఇఫ్తార్ విందు నేపథ్యంలో వడ్డించే బిర్యానీ కాంట్రాక్టు దక్కించుకున్న వ్యక్తికి.. దానికి ప్రతిఫలంగా సిటీలో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని ఆ మహిళా నేత ఆదేశించినట్లు ప్రచారం నడుస్తోంది. దీంతో కార్యక్రమం నిర్వహిస్తున్న కీలక నేతకు కోపం తెప్పించింది. వెంటనే ఆయన అధినేత జగన్మోహన్ రెడ్డి వద్ద పెద్ద పంచాయతీ పెట్టారట. అయితే దీనిపై పార్టీలో విభేదాలు ఎందుకు అన్నట్టు హై కమాండ్ భావించిందట.. అందుకే చివరి గా వాయిదా వేసింది అట.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments