
క్రైమ్ మిర్రర్, రంగారెడ్డి జిల్లా:-హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్స్, రెస్టారెంట్లలో అక్రమ విందులు, మద్యం పార్టీల పేరుతో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి శనివారం ఇబ్రహీంపట్నంలో రిసార్ట్స్, ఫామ్‌హౌస్ యజమానులతో సమావేశం నిర్వహించి ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై ఎవరైనా ఫామ్‌హౌస్ లేదా రిసార్టును బుక్ చేసుకొని చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే తాటతీస్తాం . నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. ప్రతి ఈవెంట్‌కి ముందస్తు పోలీసు అనుమతి తప్పనిసరి, అని డీసీపీ సునీత రెడ్డి స్పష్టం చేశారు.
Read also : చీఫ్ సెలక్టర్ అగార్కర్‌కు షమీ కౌంటర్
పోలీసులు రాత్రి వేళల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని, మద్యం విందులు, డీజే పార్టీలు లేదా అనుమతి లేని ఈవెంట్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు బలి కాకుండా జాగ్రత్త పడాలని, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Read also : ప్రశాంతంగా కొనసాగిన బీసీ బంద్ – శాంతిభద్రతఫై అప్రమత్తంగా పోలీసులు