
క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్ :- మహాదేవపూర్ మండలంలో నూతన సంవత్సర వేడుకలు శాంతి భద్రతలు భంగం కలగకుండా ఉండేందుకు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ క్రింది నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మహాదేవపూర్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసుకునే కార్యక్రమాలు ప్రజ జీవనానికి భంగం కలిగించే విదంగా ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, టపాసులు, మైకులు ఎక్కువ సౌండ్ పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని డీజే లు నిషేధం, వినియోగిస్తే సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తామని,మద్యం మత్తులో వాహనాలు నడపడం నేరం, వాహనాలు ఇష్టానుసారంగా వేగంగా నడిపితే కేసులు నమోదు చేయడంతోపాటు జైలు శిక్ష విధించబడుతుంది. ఇల్లు, ప్రవేట్ ఆస్తులపై, వీధి దీపాల పై రాళ్లు వేయడం, అద్దాలను పగలగొట్టడం, మహిళలను ఇబ్బంది పెట్టిన, అసభ్యంగా ప్రవర్తించిన, ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్ లను తీసివేసి వాహనాలు నడపడం, శబ్ద కాలుష్యం చేస్తూ ఇతరులను ఇబ్బంది పెట్టినా, మీ న్యూ ఇయర్ వేడుకలలో నిషేదిత డ్రగ్స్, గాంజా వంటి మత్తు పదార్థాలు విక్రయించిన, వినియోగించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.మద్యం దుకాణాలను నిర్ణీత సమయంలో క్లోజ్ చేయాలి, మైనర్లకు మద్యం విక్రయించిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read also : PM Modi: పుతిన్ నివాసంపై మిసైల్స్ దాడి, ఖండించిన ప్రధాని మోడీ
Read also : High Court: లవ్ మ్యారేజ్ స్టాక్ మార్కెట్ లాంటిది, హైకోర్టు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!





