
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కూడా వృద్ధిరేటు అనేది తగ్గుతుందని Aon PLC సర్వేలో తేల్చి చెప్పింది. కానీ ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భారత్ లో మాత్రం ఈ సంవత్సరం జీతాలు సగటున 9.2 శాతం పెరిగాయని Aon సర్వే తెలిపింది. ఈ గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీస్ సంస్థ ఏకంగా 45 రంగాలకు చెందిన దాదాపుగా 1400కు పైగా కంపెనీల నుంచి వివరాలు అనేవి సేకరించింది. ఆటోమోటివ్ మరియు వెహికల్ తయారీ విభాగాల్లో అత్యధికంగా 10.2% పెంపు ఉండొచ్చని పేర్కొంది. ఇక ఆ తరువాత NBFC ( 10 శాతం ), రీటైల్ (9.8% ), ఇంజనీరింగ్ మరియు రియల్ ఎస్టేట్ (9.5%) రంగాలు ఉన్నాయని తెలిపింది.
నేడే గ్రూప్స్ -2 మెయిన్స్ ఎగ్జామ్… అన్ని ఏర్పాట్లు రెడీ: ఏపీపీఎస్సీ
ఇక 2025 లో వార్షిక వేతనాలు 6 నుంచి 15% వరకు పెరగవచ్చు అని మైఖేల్ పేజ్ 2025 శాలరీ గైడ్ అంచనా వేయడం జరిగింది. ఇక ఉద్యోగంలో సంక్లిష్టత, నాయకత్వ బాధ్యతలను బట్టి AI, ML, సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రైవసీ రంగాల్లో శాలరీలు గరిష్టంగా 40 శాతం వరకు పెరుగుతాయని పేర్కొంది. ఇక డిమాండ్ ను బట్టి ఎకౌంటింగ్ లో 22 లక్షలు రూపాయలు, మార్కెటింగ్ మేనేజర్కు 35 లక్షల రూపాయలు, సాఫ్ట్వేర్ డెవలపింగ్ లో 50 లక్షల రూపాయల వరకు జీతాలు ఉంటాయని అంచనా వేసింది. ఇక మిగిలిన అన్ని రంగాలలోనూ కూడా తక్కువ జీతాలే ఉంటాయని అంచనా వేసి చెప్పడం జరిగింది.