
– జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో దారుణం
– విద్యార్థులు తాగే నీటిలో మోనో కలిపిన ఉపాధ్యాయుడు
– 11 మంది విద్యార్థులకు అస్వస్థత
– పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ కారే, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
– ఉపాధ్యాయుడు రాజేందర్ తో పాటు వేణు సూర్య ప్రకాష్ వంట మనిషి రాజేశ్వరుని తక్షణమే సస్పెండ్ చేసిన కలెక్టర్
క్రైమ్ మిర్రర్, భూపాలపల్లి బ్యూరో:- విభేదాలతో పిల్లల మీద ప్రయోగాలు చేస్తే కఠిన చర్యలతో పాటు పోలీస్ కేసులు నమోదు చేస్తామని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో శుక్రవారం కలుషిత మంచినీరు త్రాగి 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే శనివారం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఘటనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాలలో జరుగుతున్న అనేక విషయాలను వెల్లడించారు. పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు రాజేందర్ మంచి నీటిలో మోనో పురుగుల మందు కలపడంతో విద్యార్థులు ఆ నీటిని త్రాగి అస్వస్థతకు గురయ్యామని తెలిపారు.
Read also : ఎమ్మెల్సీ నిధుల నుండి MPPS మునుగోడు కు రెండు గదులు కేటాయింపు!
ఉపాధ్యాయులు తమను నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారని తెలిపారు. అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు మధ్య తరచూ జరుగుతున్న గొడవలే దీనికి కారణమని ఎమ్మెల్యే తెలిపారు. పాఠశాల సైన్స్ టీచర్ రాజేందర్ మంచినీటి ట్యాంకులో మోనో పురుగుల మందు కలిపి అనుమానం రాకుండా చేసేందుకు అనంతరం దాన్ని విద్యార్థుల దుప్పట్లపై చల్లాడని తెలిపారు. చూసిన విద్యార్థులను బెదిరించి ఈ విషయం బయటికి చెప్తే కొడతానని హెచ్చరించాడని తెలిపారు. రాజేందర్ ఎవరికి అనుమానం రాకుండా అస్వస్థత గురైన విద్యార్థులతో పాటు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చేరి వైద్య సేవలు పొందుతున్నాడని తెలిపారు. సంబంధిత ఉపాధ్యాయులను, వంట మనిషిని సస్పెండ్ చేయడంతో పాటు చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని శాసనసభ్యులు సత్యనారాయణ రావు తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన అణగారిన పేద కుటుంబాల విద్యార్థులను తల్లితండ్రులు చదివించుకోవాలన్న ఉద్దేశ్యంతో వసతి గృహాల్లో ఉంచుతున్నారని, పిల్లలపై ప్రయోగాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. మొగుల్లపల్లి మండలంలోని కొరికిషాల కెజిబివి పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఎస్వో కు పడక విభేదాల కారణంగా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also : SBI బ్యాంకు ఉద్యోగి చేతివాటం.. లక్కీ భాస్కర్ సినిమా తరహాలో స్కామ్.. చివరికి ఏమైందంటే..?
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ…
మంచినీటిలో పురుగుల మందు కలిపిన ఉపాధ్యాయుడు రాజేందర్ తో పాటు వేణు, సూర్య ప్రకాష్, వంట మనిషి రాజేశ్వరి ని తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఉద్యోగం నుండి తొలగించడంతో పాటు పోలీస్ కేసులు నమోదు చేసి రిమాండ్ చేస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ అంతర్గత విబేధాలతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి హాస్టల్ ను ప్రత్యేక అధికారులు, పోలీస్ సిబ్బంది తనిఖీలు చేసి విద్యార్థులతో ముకాముఖి కావాలని, వారి సమస్యలను తెలుసుకుని తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు ప్రధాన ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. అనంతరం ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. 24 గంటలు నిరంతరాయ వైద్య సేవలు అందించాలని, వైద్యుల పర్యవేక్షణ ఉండాలని ఎమ్మెల్యే వైద్యాధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read also : SBI బ్యాంకు ఉద్యోగి చేతివాటం.. లక్కీ భాస్కర్ సినిమా తరహాలో స్కామ్.. చివరికి ఏమైందంటే..?