
మహేశ్వరం, క్రైమ్ మిర్రర్:- మహేశ్వరం నియోజకవర్గంలోని కుర్మలగూడ ప్రాంతంలో మైనర్ బాలికపై లైంగిక దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకోగా, పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కుర్మలగూడలో నివసించే 15 ఏళ్ల బాలికను అదే ప్రాంతానికి చెందిన చింటూ అలియాస్ ప్రభాకర్ (22), వృత్తిరీత్యా డ్రైవర్, ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి వలలోకి దించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.
Read also : గ్రూప్-1 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట
తల్లిదండ్రులు లేని సమయంలో బాలికను తన ఇంటికి తీసుకెళ్లి, బెడ్‌రూమ్‌లో బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అనంతరం కూడా మాయమాటలు, బెదిరింపులు చేస్తూ పలుమార్లు దాడికి పాల్పడ్డాడు. చివరికి ధైర్యం చేసిన బాలిక జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు వెల్లడించడంతో, వారు ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, నిందితుడు ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. అనంతరం అతన్ని రిమాండ్‌కు తరలించినట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ ఘటనతో కుర్మలగూడ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు బాలికకు న్యాయం చేయాలని, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
Read also : రేపు అన్ని థియేటర్లలో OG నే.. రేపు మిరాయ్ సినిమాకు హాలిడే?