
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. సమాజంలో కాంగ్రెస్ పార్టీ కులమత ద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కాంగ్రెస్ ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నం చేస్తుందని రాజ్యసభలో మోడీ విమర్శించారు. 2014 తర్వాత దేశం మొత్తం కూడా ఒక కొత్త నమూనాను మా ప్రభుత్వం వల్లే చూసిందని తెలిపారు. కాంగ్రెస్ స్వార్థపూరిత రాజకీయాలు అందరినీ మోసం చేశాయని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.
ఇవాళైనా డుమ్మా కొట్టకుండా విచారణకు హాజరవుతారా?..
భారతీయ జనతా పార్టీ బాబాసాహెబ్ ఆలోచనలను ముందుకు తీసుకువెళ్లి పేదలకు సహాయం చేస్తుందని మోడీ అన్నారు. కానీ కాంగ్రెస్ దానిని గతంలో తీవ్రమైన సంక్షోభంగా మార్చిందని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు తప్పని పరిస్థితులలో జై భీమ్ అనాల్సి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దేశం అత్యవసర పరిస్థితిని చవి చూసిన పరిస్థితులను మోడీ మరోసారి గుర్తు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ నాయకులు ఆనందం కోసమే చేసుకున్నారని నరేంద్ర మోడీ తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో మరోసారి కుల, మత ద్వేషాలను రెచ్చగొడితే ఊరుకునేది లేదని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీకి, నాయకులకు వార్నింగ్ ఇచ్చారు.
తెలంగాణలో జనసేన పార్టీకి గుర్తింపు!… ప్రతిపక్ష పార్టీల్లో వణుకు?