క్రైమ్ మిర్రర్ : మన్ కీ బాత్‌లో అక్కినేని నాగేశ్వరరావును కొనియాడి, ఎన్టీఆర్ పేరును ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించకపోవడం చర్చగా మారింది. ఇవాళ మన్ కీ బాత్ నిర్వహించారు ప్రధాని మోడీ. మన్ కీ బాత్‌లో పలు సినిమా ఇండస్ట్రీ దిగ్గజాల గురించి ప్రస్తావించారు. అందులో భాగంగానే తెలుగు సినిమా దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావును కొనియాడారు ప్రధాని మోడీ. అక్కినేని నాగేశ్వరరావు, రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ, తపన్ సిన్హా లాంటి దిగ్గజాలను ప్రస్తావిస్తూ వారు చేసిన సేవలను కొనియాడారు. అయితే లెజండరీ హీరో ఎన్టీఆర్ పేరును తీసుకురాలేదు ప్రధాని మోడీ. తెలుగు ఇండస్ట్రీ నుంచి అక్కినేని నాగేశ్వరరావును గుర్తు చేసుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు వల్ల తెలుగు సినిమా ఖ్యాతి మరోస్థాయికి వెళ్లిందని చెప్పారు. ఆయన సినిమాల్లో భారతీయ సంప్రదాయాలు, విలువలు చక్కగా చూపించేవారని ప్రధాని కొనియాడారు. అయితే ప్రధానమంత్రి అక్కినేని నాగేశ్వరావును పొడిగి.. కనీసం కూడా ఎన్టీఆర్ పేరు ఎత్తకపోవడం కొన్ని వర్గాలను విస్మయానికి గురి చేసింది.
ఇవి కూడా చదవండి :