
క్రైమ్ మిర్రర్, పొలిటికల్ న్యూస్ :- రాజకీయ పార్టీలు ఎన్నో.. అందులో రిచ్చెస్ట్ కొన్నే. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నో పొలిటికల్ పార్టీలు ఉన్నాయి. మరి వాటిల్లో అంత్యంత ధనిక పార్టీ ఏది…? ఏడాదికా ఏడాది కొత్త సర్వేలు వస్తాయి… పార్టీల లెక్కలు మారుతాయి. మరి ఏడాది కాసులు గలగల లాడుతున్న ఆ పార్టీ ఏది..? అనుకుంటున్నారా. అదేనండి.. మన కారు పార్టీ.. అంటే బీఆర్‌ఎస్. గులాబీ పార్టీనే తెలుగు రాష్ట్రాల్లో ది రిచ్చెస్ట్ పార్టీ.
Read also : తప్పు తెలుసుకున్నా.. ఆ పొరపాటు మళ్లీ చేయనన్న జగన్!
దేశంలోని రాజకీయ పార్టీల ఆస్తులపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ సర్వే చేస్తుంది. ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఆడిట్ నివేదికల ప్రకారం ఈ సర్వే జరుగుతుంది. సర్వే తర్వాత నివేదిక కూడా వస్తుంది. ఈ ఏడాది కూడా సర్వే చేసింది. 2023-2024లో 40 ప్రాంతీయ పొలిటికల్ పార్టీలు రూ.2వేల 532 కోట్ల ఆదాయాన్ని ప్రకటించాయని తెలిపింది. ఈ ఆదాయంలో 70శాతానికిపైగా నిధులు ఎన్నికల బాండ్ల ద్వారానే వచ్చాయట. ఏడీఆర్ (ADR) నివేదిక ప్రకారం… బీఆర్‌ఎస్ పార్టీనే రిచ్చెస్ట్. భారత్ రాష్ట్ర సమితి… అత్యధికంగా రూ.685.51 కోట్ల ఆదాయాన్ని ప్రకటించిందని నివేదికలో తెలిపింది ఏడీఆర్ సంస్థ.
Read also : శ్రీశైలం వెళ్తున్నారా.. అయితే ఇవి తప్పక పాటించాల్సిందే?
బీఆర్‌ఎస్ తర్వాత స్థానంలో టీఎంసీ ఉంది. ఈ పార్టీ ఆదాయం రూ.646.39 కోట్లు. మూడో స్థానంలో బీజేడీ ఉండగా… ఆ పార్టీ ఆదాయం రూ.297.81 కోట్లుగా నివేదికలో తెలిపింది. నాలుగో స్థానంలో టీడీపీ ఉంది. ఈ పార్టీ ఆదాయం 285.07 కోట్లట. ఇక… ఐదో స్థానంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. వైసీపీ ఆదాయం రూ.191.04 కోట్లుగా ఉందని ఏడీఆర్ నివేదిక చెప్తోంది. 40 ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం ఆదాయంలో…. ఈ ఐదు పార్టీల వాటా 83.17 శాతం. గత ఏడాది 2022-23తో పోలిస్తే… ఈ ఏడాది ప్రాంతీయ పార్టీల ఆదాయం 45.77శాతం పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ పార్టీల ఆదాయం రూ.1,736.85 కోట్లుగా ఉంది. టీఎంసీ ఆదాయం రూ.312.93 కోట్లు పెరగగా… టీడీపీ, బీజేడీ ఆదాయం బాగానే పెరిగింది. 27 ప్రాంతీయ పార్టీలు తమ ఆదాయంలో కొంత భాగాన్ని ఖర్చు చేయలేదని ప్రకటించగా.. 12 పార్టీల ఖర్చులు… ఆదాయాన్ని మించిపోయాయని తేలింది. బీఆర్ఎస్ ఖర్చు చేయని ఆదాయం రూ.430.60 కోట్లు కాగా…. టీఎంసీది రూ.414.92 కోట్లు, బీజేడీది రూ.253.79 కోట్లుగా ఉంది. మరోవైపు… వైసీపీ, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, జనతాదళ్‌తోపాటు 12 పార్టీలు ఆదాయం కంటే… ఎక్కువగా ఖర్చు చేశాయి. వైసీపీ ఖర్చులు 55శాతం పెరిగాయని ఏడీఆర్ నివేదికలో తేలింది.
Read also : శ్రీశైలం వెళ్తున్నారా.. అయితే ఇవి తప్పక పాటించాల్సిందే?