
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ఇండిగో విమానాల సేవలు నిలిచిపోవడంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు నానా తిప్పలు పడుతున్నారు. కొత్తగా FDTL ( ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్) నిబంధనల అమలుతో ఇండిగో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఇక పైలెట్లకు వారానికి 48 గంటలు రెస్టు తో పాటు ఇతర పరిమితులతో సిబ్బంది కొరత తలెత్తింది. దాదాపు 18 నెలలపాటు గడువు ఇచ్చిన కూడా సమస్త సిబ్బందిని నియమించుకోలేకపోయిందని పైలెట్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఏది ఏమైనా కూడా వరుసగా నాలుగవ రోజు ఈ ఇండిగో సేవల అంతరాయం కొనసాగుతూ ఉండడంతో ఎయిర్పోర్టులో ప్రయాణికులందరూ కూడా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎయిర్పోర్టులన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోయాయి. ప్రయాణికులు తమ వెంట తెచ్చుకున్నటువంటి లగేజ్ సూట్ కేసులు అన్నీ కూడా ఎక్కడికి అక్కడే ఉండిపోవడంతో గందరగోళం పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఎయిర్పోర్టులలో కుప్పలు కుప్పలుగా సూట్ కేసులు, లగేజీ బ్యాగులు దర్శనం ఇస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ విమానాశ్రయంలో కూడా ఇటువంటి పరిస్థితినే ఏర్పడ్డాయి. ఇప్పటివరకు 69 ఇండిగో విమానాలు రద్దు అవ్వగా ఇందులో దాదాపు 26 విమానాలు రావాల్సినవి కాగా 43 ఇక్కడి నుంచి వెళ్లాల్సినవి ఉన్నాయి. దీంతో ప్రయాణికులు అందరూ కూడా తమ వెంట తెచ్చుకున్నటువంటి లగేజీ బ్యాగులతో ఎయిర్పోర్టులోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల అయినటువంటి ముంబై, ఢిల్లీ, చెన్నై మరియు బెంగళూరు వంటి నగరాలలో ఉంది. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో దాదాపు తొమ్మిది ఇండిగో సర్వీసులు రద్దు అవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read also : స్థానికుడు సత్తిరెడ్డికే అజ్జిలాపురం ప్రజల మద్దతు..
Read also : ఎవరూ దిగులు చెందకండి.. మళ్లీ మన ప్రభుత్వం వస్తుంది : KCR





