
చౌటుప్పల్,క్రైమ్ మిర్రర్:- రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ జి.వెంకట్రాం రెడ్డి చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని 20 వార్డులలోని ఓటర్ ఫోటో ఆధారిత తుది ఓటర్ జాబితాను సోమవారం ఆయన చేతుల మీదుగా మున్సిపల్ కార్యాలయం నందు విడుదల చేశారు. ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురణ అనంతరం ప్రజలు,రాజకీయ నాయకుల నుండి వచ్చిన పిర్యాదులను పరిశీలించి, వార్డు ఆఫీసర్ లచే, టౌన్ ప్లానింగ్ వారిచే, సంబంధిత బిఎల్ఓ లు,బిల్ కలెక్టర్లచే సవరణలు చేసి తుది ఫోటో ఆధారిత ఓటర్ జాబితాను విడుదల చేసినట్లు వారు తెలిపారు. ఇట్టి ఓటర్ జాబితాను ప్రజల సౌకర్యార్థం స్థానిక మున్సిపల్ కార్యాలయం,ఆర్డిఓ ఆఫీస్,తాహసిల్దార్ కార్యాలయంలలో అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఆర్వో అంజయ్య,సీనియర్ అసిస్టెంట్ రఘుపతి,దీప,వార్డుఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు.
Read also : సంక్రాంతికి ఊరెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి : ఎస్సై భూమేష్ సూచన
Read also : సినిమాటోగ్రఫీ శాఖలో ఏం జరుగుతోంది?





