తెలంగాణరాజకీయంవైరల్

ఫోన్ ట్యాపింగ్: హరీశ్‌రావుకు సుప్రీంకోర్టులో ఊరట..!

క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో మాజీ మంత్రి హరీశ్‌రావుకు భారీ ఊరట లభించింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.

 

ఈ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ హరీశ్‌రావు హైకోర్టును ఆశ్రయించగా, ఆయనకు ఈ కేసుతో సంబంధం లేదని పేర్కొంటూ హైకోర్టు ఊరటనిచ్చింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రెండు స్పెషల్ లీవ్ పిటిషన్లు (SLPs) దాఖలు చేసింది. జస్టిస్ బి.వి. నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించి, కొట్టివేసింది.

 

ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి కొత్త ఆధారాలు లేవని, హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో, ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్‌రావుపై తదుపరి విచారణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button