
మర్రిగూడ,క్రైమ్ మిర్రర్:-గణపతి నవరాత్రుల ఉత్సవాలకు పోలీసుల అనుమతి తప్పనిసరని, నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ దూది రాజు అన్నారు. ఈ సందర్బంగా మర్రిగూడ మండల పరిధిలోని, 18 గ్రామాల యువతను, గ్రామపెద్దలను, డిజే నిర్వాహకులతో మీటింగ్ పెట్టి ఆయన నేరుగా మాట్లాడారు. ప్రజల రక్షణను దృష్టిలో పెట్టుకొని, పోలీసులు చెప్పిన నిబంధనల ప్రకారం, ప్రశాంత వాతావరణంలో, భక్తి శ్రద్దలతో నవరాత్రులు జరుపుకోవాలని ఈ సందర్బంగా తెలిపారు. డిజేలతో పెద్దపెద్ద సౌండ్ లు పెడుతూ, వృద్ధులను, గర్భిణీలను, చుట్టుపక్క జనాలకు నిద్రపట్టకుండా ఇబ్బంది పెడితే చర్యలు తప్పవన్నారు. ఈ నవరాత్రులు భక్తి భావాలతో, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, గొడవలకు తావు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆర్గనైజేషన్ వారిదేనని సిఐ సూచించారు. అనుమతి కోసం https://policeportal.tspolice.gov.in/index.htm లింకు ద్వారా ఆన్లైన్లో, అప్లై చేసి అట్టి అప్లికేషన్ ప్రింట్ అవుట్ ను, తమ వద్ద అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, ఆయా గ్రామాలలో వినాయకులను ఏర్పాటు చేసే ఉత్సవ కమిటీ సభ్యుల వివరాలు, ఏక్కడ ఏర్పాటు చేస్తున్నాము అట్టి గ్రామము, గ్రామంలోని ప్రాంతం పేరు తెలపాలన్నారు. నిమజ్జనం తేదీ, నిమజ్జనం చేసే ప్రాంతంతో పాటు, మండపానికి సంబంధించిన పూర్తి సమాచారం అందించాలన్నారు. డీజే ఏర్పాటుకు ఎటువంటి అనుమతులు లేవని, కావున ఉత్సవ కమిటీ సభ్యులు గమనించి పోలీస్ వారికి సహకరించాలని, భక్తులు ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలకు పాల్పడకుండా, సంయమనంతో పండగలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మర్రిగూడ ఎస్ఐ మునగాల కృష్ణారెడ్డి, వారి సిబ్బంది ఉన్నారు.
Read also : మా ఉత్పత్తులను కొనకండి, ట్రంప్ పై జై శంకర్ ఘాటు వ్యాఖ్యలు!
Read also : అమిత్ షాతో డిబేట్ చేయను, జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!