
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- “ఐ బొమ్మ” నిర్వాహకుడు రవి అరెస్టు అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎన్నో సినిమాలను ఓటీటీ లో విడుదలైన రోజునే పైరసీ ద్వారా తమ వెబ్సైట్ లో వీడియోలను అప్లోడ్ చేసుకునేటువంటి రవి.. అక్రమంగా దాదాపు 3 కోట్లకు పైగానే సంపాదించారు అని పోలీసులు తెలిపారు. అయితే తాజాగా పోలీసుల విచారణలో భాగంగా రవి తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని విషయాలను పంచుకున్నట్లు సమాచారం. ఐ బొమ్మ రవి గతంలో సొంత ఇంట్లోని కుటుంబ సభ్యుల నుంచే ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి అని .. ఇంట్లో వాళ్లే నన్ను డబ్బు సంపాదించలేవు అని హేళన చేయడంతోనే.. ఈ దారి ఎంచుకోవాల్సి వచ్చిందని పోలీసులకు వివరించారు అని సమాచారం. ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భార్య అలాగే అత్త ఇద్దరు కూడా ప్రతిరోజు దారుణంగా ఎగతాళి చేసేవారు అని .. ఈ అన్ని అవమానాలను తట్టుకోలేకనే నాకు వెబ్ డిజైన్ నైపుణ్యం పై ఇంట్రెస్ట్ ఉండడంతో వెంటనే ఆలోచించకుండా IBOMMA మరియు BAPPAM వెబ్ సైట్లను రూపొందించాను అని పోలీసులు విచారణలో తేలింది. ఈ రెండు వెబ్సైట్ ల ద్వారా భారీ మొత్తంలో డబ్బులు సంపాదించడంతో జీవితం పూర్తిగా మారిపోయిందని కానీ నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భార్య మాత్రం తిరిగి వెనక్కి రాలేదు అని అతను వెల్లడించారు. ఇక ఇవన్నీ వదిలేసుకుని 2021 వ ఏడాదిలో యూరప్ కు వెళ్లి అక్కడే స్థిరపడినట్లు పోలీసుల విచారణలో భాగంగా రవి వెల్లడించినట్లు సమాచారం అందింది. కాగా ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలే కాకుండా మరెన్నో ఇతర భాషల సినిమాలు కూడా ఈ ఐ బొమ్మ అనే వెబ్సైట్లో పైరసీకి గురయ్యాయి. దీనివల్ల ఎంతో మంది డైరెక్టర్లు ఆర్థికంగా నష్టపోయారు. రవిని ఎంతో కష్టపడి పట్టుకున్నటువంటి పోలీస్ అధికారులకు సినిమా ప్రేమికులు ధన్యవాదాలు తెలిపారు.
Read also : ఏపీలో మరో బస్సు ప్రమాదం.. పూర్తిగా దెబ్బతిన్న ఎడమ భాగం!
Read also : మెస్సి తో ఫుట్ బాల్ ఆడనున్న సీఎం రేవంత్!





