ఆంధ్ర ప్రదేశ్రాజకీయం

ముసలాయన కాదు.. నవ యువకుడు అంటున్న జనం!

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పని రాక్షసుడిలా మారారు. ఒక నవ యువకుడిలా చురుగ్గా ప్రతిరోజు ఎన్నో రకాలుగా ప్రజలకు సేవ చేస్తూనే పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. సాధారణంగా 75 ఏళ్ల వయసు అంటే మన పల్లెటూర్లలో ఒక ముసలాయనలా భావిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు 75 ఏళ్ల వయసులో ఎటువంటి మోకాలు నొప్పులు, అనారోగ్య సమస్యలు, విరామం లేకుండా ప్రజల కొరకు పనిచేస్తుండడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. సాధారణంగా 60 ఏళ్లు వస్తేనే.. ఇవన్నీ మనకెందుకులే అనుకొని చక్కగా తిని ఏ సినిమానో చూస్తూ కాలాన్ని గడపాలని ప్రతి ఒక్కరు భావిస్తారు. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం వరుసగా కార్యక్రమాలలో పాల్గొంటూ ఒకవైపు రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో ఇతర దేశాలు వెళ్తూ బిజీ బిజీగా గడుపుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. పని రాక్షసుడు అన్న విమర్శకుల వ్యాఖ్యలను నిజం చేస్తున్నారని చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read also : పెళ్లిలో కూడా పసుపు బట్టలేనా.. శభాష్ నిమ్మల అంటున్న జనం!

ప్రతిరోజు 18 గంటలకు పైగా సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తూ ప్రతి ఒక్కరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. తాను బిజీ బిజీగా గడుపుతూనే.. పార్టీ మంత్రుల నుంచి చిన్న చిన్న నాయకులు వరకు కూడా అందరినీ పరుగులు పెట్టిస్తున్నారు. చంద్రబాబులా ఆ వయసులో పనిచేయడం ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాదని కూడా అర్థమవుతుంది. కేవలం ఒక్క రోజులోనే నాలుగు కార్యక్రమాలలో పాల్గొని ఔరా అనిపించారు. నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహానికి పాల్గొని అక్కడ కుటుంబ సమేతంగా కాసేపు ముచ్చటించి అనంతరం ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తో కలిసి కనకదుర్గ గుడిలో అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమల తిరుపతి వెళ్లి బ్రహ్మోత్సవాలలో కూడా పాల్గొన్నారు. వయస్సు రిత్యా చంద్రబాబు నాయుడు వయసులో పనిచేయడం ఎవరికి సాధ్యం కాదు. ముసలాయనే అనుకునేరు… ఇది చాలా పెద్ద తప్పు. అని నిరూపిస్తున్నారు.

Read also: పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button