
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- ఐ బొమ్మ రవి సినిమా పైరసీ చేసిన సందర్భంలో సినిమా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరు కూడా తలలు పట్టుకుంటున్న సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. అయినా కానీ కొంతమంది సినిమా ఇండస్ట్రీ వ్యక్తులు సినిమా రేట్లు పెంచుకుంటూ పోతూనే ఉన్నారు. తాజాగా బాలకృష్ణ నటించినటువంటి అఖండ 2 సినిమాకు ఏపీలో టికెట్ రేట్లు పెంచడానికి ప్రభుత్వము అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సిపిఐ నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా రేట్లు వాళ్లకి నచ్చినట్లు పెంచుకుంటూ పోవడం వల్లే ఐ బొమ్మ రవి లాంటి వారు పుడుతున్నారు అని… తద్వారానే చాలా మంది ప్రేక్షకులు కూడా థియేటర్లోకి వెళ్లకుండా ఇంట్లోనే ఇలా వెబ్సైట్లో చూస్తున్నారు అని పేర్కొన్నారు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సినిమాలను తీసి ప్రజలపై భారం వేయడం ఎంతవరకు న్యాయమని సిపిఐ నారాయణ తీవ్రంగా మండిపడ్డారు. ఇక ఈ సందర్భంలోనే సంపన్నులు ఇంకా సంపన్నులుగా కాగా.. సామాన్య ప్రజల జోబులు మాత్రం కొట్టేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా రేట్ల పెంపును తీవ్రంగా ఖండిస్తున్నాను అని సిపిఐ నారాయణ వెల్లడించారు. కాగా బాలకృష్ణ అఖండ 2 సినిమాకు టికెట్ రేట్లను పెంచుతూ తాజాగా ఏపీ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. ప్రీమియర్ షోకు 600 రూపాయల టికెట్టుగా నిర్ణయించింది. ఇక మల్టీప్లెక్స్ లో టికెట్ పై 100 రూపాయలు.. సింగిల్ స్క్రీన్ టికెట్ పై 75 రూపాయలు చొప్పున పించింది.
Read also : ROHIT SHARMA : మరో రికార్డుకు చేరువలో హిట్ మ్యాన్..!
Read also : Population Crisis: కండోమ్స్‌పై పన్ను.. సంచలన నిర్ణయం





