
క్రైమ్ మిర్రర్,జాతీయ న్యూస్ :- ప్రస్తుత రోజుల్లో బంగారం ధరలు కంటే వెండి ధరలు వేగంగా పెరుగుతూ ఉన్నాయి. సాధారణంగా బంగారం ధరలు సామాన్య ప్రజలు కోనాలంటే వారికి జీవితాంతం కష్టపడినా కూడా కొనలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ప్రస్తుత రోజుల్లో వెండి కొనుగోలు చేస్తే మాత్రం భవిష్యత్తులో మంచి లాభాలు చూడొచ్చని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే తాజాగా వెండి ధరలు అనేవి రికార్డు స్థాయికి చేరుతూ పోతున్నాయి. ఈ సందర్భంలోనే దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా భారీగా ఇంట్లో ఉన్నటువంటి వెండిని అమ్ముకొని క్యాష్ చేసుకుంటున్నారు. సాధారణంగా ప్రతి నెల కూడా 10 నుంచి 15 టన్నుల వెండి మార్కెట్కు వస్తుందని అధికారులు తెలిపారు. కానీ గత వారంలోనే సుమారు 100 టన్నుల పాత వెండి మార్కెట్ కు వచ్చినట్లుగా IBJA అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం కేజీ వెండి ధర 1,90,000 కు చేరుకోవడంతో లాభాల కోసం కుటుంబాలు పెద్ద ఎత్తున దుకాణాలకు క్యూ కడుతున్నాయి. అంతేకాకుండా పెళ్లిళ్లు మరియు పండుగలు అలాగే పెద్ద ఎత్తున ఖర్చులు ఉన్న వారందరూ కూడా వారి దగ్గర ఉన్నటువంటి వెండి అంతటిని అమ్మకాలకు పెట్టారు. దీంతో మార్కెట్కు వెండి టన్నులు కొద్ది వచ్చి చేరుతుంది.
Read also : జగన్ పై మండిపడ్డ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
Read also : ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యనే.. 50 లక్షలు ఇవ్వాల్సిందే : హరీష్ రావు





