తెలంగాణ

వర్షాలకు అనారోగ్యం పాలవుతున్న ప్రజలు.. పెరుగుతున్న కేసులు!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ :-తెలంగాణలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఎంతోమంది ప్రజలు అనారోగ్యానికి గురువుతున్నారు. గత 20 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసాయి. ఈ భారీ వర్షాల వల్ల ఎంతోమందికి ఆస్తి నష్టం తో పాటు ప్రాణం నష్టం కూడా జరిగింది. వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఏ జిల్లాలలో, ఏ ప్రాంతాలలో వర్షం పడుతుందో హెచ్చరిస్తున్న కూడా ప్రజలలో అప్రమత్తం మాత్రం కనబడడం లేదు. దీని కారణంగానే ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు కూడా దాదాపు 3500 కు పైగా డెంగ్యూ కేసులు నమోదయినట్లు వైద్య అధికారుల సమాచారం అందింది. మరోవైపు రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులలో ఓపి కోసం ఆసుపత్రులకు వెళుతున్న వారి సంఖ్య ఏకంగా 30% పెరిగిపోయింది.

Read also : సినిమాల్లోనూ, సాయం లోనూ ఎప్పుడు ముందే : చంద్రబాబు

ఒకప్పుడు కరోనా పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. కానీ ఇది కేవలం వర్షాలు అలాగే వరదల వల్ల వచ్చే సీజనల్ వ్యాధులు. ఈ భారీ వర్షాలు అలాగే వరదలు వల్ల వచ్చినటువంటి సీజనల్ వ్యాధులు తెలంగాణ రాష్ట్రంలో విజృంభిస్తున్నాయి. జలుబు మొదలుకొని, దగ్గు, జ్వరం, తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, ఒంటిపై దద్దుర్లు, బీపీ పడిపోవడం, అలర్జీ రావడం వంటి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సీజనల్ వ్యాధుల వల్ల గతంలో ఎంతో మంది మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి వ్యాధులు పట్ల చాలామంది అప్రమత్తంగా లేకపోవడంతో ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నారు. ఇలాంటి సమయాల్లోనే అప్రమత్తంగా ఉండాలి అని వైద్య అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ఈ సీజనల్ వ్యాధులు పట్ల ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వ్యవహరించి వెంటనే డాక్టర్లను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.

Read also : 7 నిమిషాల్లో రెండుసార్లు.. గుజరాత్ లో భూకంపం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button