ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో పెన్షన్లు తొలగింపు… క్లారిటీ ఇచ్చిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్!

క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్నగా ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ అభివృద్ధి బాటలో నడిపిస్తూ ఉంది. అయితే వైసీపీ పార్టీ.. నేడు కూటమి ప్రభుత్వంపై కీలక ఆరోపణలు చేస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది పెన్షన్లను తొలగిస్తూ ఉంది అని వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా ఆరోపిస్తుంది. అయితే ఈ పెన్షన్ల తొలగింపు ఆరోపణలపై కూటమి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికీ 15 నెలలు అవుతుంది… ఈ 15 నెలల్లో ఒక్క పెన్షన్ కూడా అనధికారికంగా తొలగించలేదు అంటూ వైసీపీ పార్టీ చేస్తున్న ఆరోపణలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని తెలియజేశారు.

Read also: హిందూ ధర్మాన్ని విమర్శిస్తే ఇంతే ఉంటుంది : మంత్రి ఆనం

కాకపోతే గత వైసీపీ ప్రభుత్వం లో చాలామంది నకిలీ సర్టిఫికెట్లతో దివ్యాంగ పెన్షన్ దరఖాస్తు చేసుకొని ప్రభుత్వ డబ్బును దోచుకుంటున్నారు అని అన్నారు. దొంగ సర్టిఫికెట్లతో ఉన్నటువంటి 80 వేల మందికి నోటీసులు ఇచ్చామని తెలిపారు. దివ్యాంగానికి సంబంధించినటువంటి క్లారిఫై సర్టిఫికెట్ చూపిస్తేనే పెన్షన్ వస్తుంది అని… క్లారిటీ ఇచ్చారు. దాదాపు తొమ్మిది నెలల నుంచి పెన్షన్ వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రెస్ మీట్ ద్వారా తెలిపారు. గత కొద్ది రోజుల నుంచి వైసీపీ ప్రభుత్వం కావాలనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది పెన్షన్లను తొలగిస్తుంది అని ఆరోపిస్తుంది. ఇప్పటికే దీనిపై చాలామంది కూటమి నాయకులు స్పందించడం జరిగింది.

Read also : అమెరికాలో భారీ భూకంపం, 7.5గా తీవ్రత నమోదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button