
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవ్వాళ 1వ తేదీ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఇక గత నెల నవంబర్ తో పోలిస్తే ఈ నెల కొత్తగా 8,190 మంది పెన్షన్లకు అర్హత సాధించారు. ఇకపోతే సీఎం చంద్రబాబు నాయుడు నేడు ఏలూరు జిల్లా గోపులాపురంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అక్కడ కొంతమంది అర్హులైన పెన్షన్ దారులకు పెన్షన్ పంపిణీ చేసి కూటమి ప్రభుత్వ అభివృద్ధి గురించి ప్రస్తావించనున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే ఈ పెన్షన్ల పంపిణీ కోసం కూటమి ప్రభుత్వం 2738 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అయితే గత 20 నెలలుగా తమకు కొత్త పెన్షన్ రావట్లేదు అని చాలామంది కూడా ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్కు అర్హులైన కూడా చాలా మందికి డబ్బులు రావడం లేదు అని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్న సమయంలో వీటిపై అధికారులు సమీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛను పంపిణీ జరగాలి అని ఆదేశించారు. కానీ కొంతమంది మాత్రం మాకు ఈ పెన్షన్ అందట్లేదు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read also : Rape Attempt Video: నడిరోడ్డు మీద, అందరూ చూస్తుండగా.. మహిళపై అత్యాచారయత్నం, నెట్టింట వీడియో వైరల్!
Read also : దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలో మూడు జిల్లాల స్కూళ్లకు సెలవులు!





