Saturday, March 7, 2026
Homeతెలంగాణపెండింగ్ స్కాలర్‌షిప్‌లు చెల్లించాలి.. సబ్ కలెక్టర్‌కు బీసీ యువజన సంఘం వినతి

పెండింగ్ స్కాలర్‌షిప్‌లు చెల్లించాలి.. సబ్ కలెక్టర్‌కు బీసీ యువజన సంఘం వినతి

మిర్యాలగూడ,క్రైమ్ మిర్రర్:- పెండింగ్‌లో ఉన్న బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్‌షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థులు ప్రభుత్వ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లపై ఆధారపడి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు స్కాలర్‌షిప్‌లు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

పరీక్షల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఫీజులు చెల్లిస్తేనే హాల్ టికెట్లు ఇస్తామని, లేకపోతే ఇవ్వబోమని కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను హెచ్చరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీంతో వారు ఉన్నత చదువులు కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం ఇతర పనులపై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ పేద విద్యార్థుల చదువులకు మాత్రం నిధులు విడుదల చేయకపోవడం బాధాకరమని అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం పేద విద్యార్థుల సమస్యలను గుర్తించి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జక్క నాగేశ్వరావు, పోలగానే వెంకటేష్ గౌడ్, ఎర్రబెల్లి గంగాధర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments